Currency Notes In Drain : మురికి కాల్వలో కరెన్సీ నోట్ల కట్టలు.. తీసుకునేందుకు ఎగబడ్డ జనాలు.. వీడియో వైరల్

Currency Notes In Drain: మురికి కాల్వలో రెండు బ్యాగులు కనిపించాయి. అందులో కరెన్సీ నోట్లు ఉన్నాయి. దాంతో పెద్ద సంఖ్యలో స్థానికులు..

Currency Notes In Drain(Photo : Google)

Currency Notes In Drain : అదో పారే మురికి కాల్వ. చూడటానికి చాలా ఘోరంగా ఉంది. అందులో నీళ్లు కంపు కొడుతున్నాయి. బాగా దుర్వాసన వస్తోంది. ఎక్కడ చూసినా చెత్తా చెదారమే. అటు వైపు వెళ్లేందుకే కాదు కదా.. కనీసం చూడటానికి కూడా జనాలు ఇష్టపడరు. అలాంటి మురికి కాల్వలో ఒక్కసారిగా కలకలం రేగింది. జనాలు పెద్ద సంఖ్యలో మురికి కాల్వలోకి దిగారు. కంపు, దుర్వాసన, చెత్తా చెదారాన్ని అస్సలు లెక్క చేయలేదు. ఆ మురికి కాల్వలోకి దూసుకెళ్లారు. ఎందుకో తెలుసా? కరెన్సీ నోట్ల కోసం. ఏంటి షాక్ అయ్యారా? అవును.. మురికి కాలువలో పెద్ద సంఖ్యలో కరెన్సీ నోట్లు దర్శనం ఇచ్చాయి. డబ్బంటే ఎవరికి చేదు చెప్పండి. ఆ నోట్లను ఏరుకునేందుకు జనాలు ఎగబడిపోయారు.

ఈ షాకింగ్ ఘటన బీహార్ లోని రోహ్తాస్ జిల్లా మోరాబాద్ గ్రామంలో శనివారం చోటు చేసుకుంది. అక్కడ పారే మురికి కాల్వలో కరెన్సీ నోట్లు దర్శనమిచ్చాయి. నోట్ల కట్టలు తీసుకునేందుకు ప్రజలు పోటీలుపడ్డారు. దొరికిన వారి దొరికినంత డబ్బుల కట్టలను తీసుకెళ్లారు. కరెన్సీ నోట్లలో రూ.2వేలు, రూ.500, రూ.100, పది రూపాయల నోట్లు ఉన్నాయి. మురికి కాల్వలోకి దిగిన ప్రజలు నోట్ల కట్టలు ఏరుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.(Currency Notes In Drain)

Also Read..Ghaziabad Manhole : షాకింగ్ వీడియో.. అంతా చూస్తుండగానే, నడుస్తూ నడుస్తూ మ్యాన్ హోల్‌లో ఎలా పడిపోయారో చూడండి

దీనిపై స్థానికులు స్పందించారు. ఉదయాన్ని మురికి కాల్వలో రెండు బ్యాగులు కనిపించాయి. అందులో కరెన్సీ నోట్లు ఉన్నాయి. దాంతో పెద్ద సంఖ్యలో స్థానికులు కాలువలోకి దూకి నోట్ల కట్టలు ఏరుకున్నారు. అవి ఒరిజినల్ నోట్లే అని స్థానికులు చెబుతున్నారు.

దీని గురించి పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అసలు.. కరెన్సీ నోట్లు ఒరిజినలా? లేక ఫేకా? ఒకవేళ ఒరిజినల్ నోట్లే అయితే ఆ డబ్బుని ఎవరు కాలువలో పడేశారు? ఇలా అన్ని కోణాల్లో దర్యాఫ్తు చేపట్టారు. మురికి కాలువలో మనీ వెనుక మిస్టరీని చేధించే పనిలో పడ్డారు.(Currency Notes In Drain)

Also Read..Road Accident : షాకింగ్ వీడియో.. ఒళ్లు గగుర్పొడిచే ప్రమాదం, రోడ్డుపై కారు బీభత్సం