Ghaziabad Manhole : షాకింగ్ వీడియో.. అంతా చూస్తుండగానే, నడుస్తూ నడుస్తూ మ్యాన్ హోల్‌లో ఎలా పడిపోయారో చూడండి

Ghaziabad Manhole : వానలు పడుతున్న సమయంలో మ్యాన్స్ హోల్స్ ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.

Ghaziabad Manhole : షాకింగ్ వీడియో.. అంతా చూస్తుండగానే, నడుస్తూ నడుస్తూ మ్యాన్ హోల్‌లో ఎలా పడిపోయారో చూడండి

Ghaziabad Manhole(Photo : Google)

Updated On : May 6, 2023 / 1:19 AM IST

Ghaziabad Manhole : రోడ్డు మీద వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు ఎటువైపు నుంచి ప్రమాదం, మృత్యువు.. ఏ రూపంలో ముంచుకొస్తుందో తెలియదు. అందుకే, ఒళ్లు దగ్గర పెట్టుకుని నడవాలి. ఇక, వర్షాలు పడుతున్న సమయంలో రోడ్ల మీద మరింత జాగ్రత్తగా వెళ్లాలి. లేదంటే ప్రాణాలకే ప్రమాదం. ఏ మాత్రం తేడా జరిగినా శాల్తీ మిగలదంతే.

మన దేశంలో వర్షాలు కురుస్తున్న సమయంలో కాలువలు పొంగిపొర్లడం కామన్. రోడ్లన్నీ చిన్నపాటి చెరువులను తలపిస్తాయి. ఏది రోడ్డో, ఏది మురికి కాలువో, ఏది గుంతో అస్సలు తెలియదు. ఇక మ్యాన్స్ హోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎక్కడ ఏ మ్యాన్ హోల్ ఉందో తెలియని పరిస్థితి. వర్షాల సమయంలో ప్రమాదవశాత్తు మ్యాన్ హోల్స్ లో పడిపోయి ఎంతోమంది చనిపోయారు. మ్యాన్ హోల్స్ ఎందరి ప్రాణాలనో బలితీసుకున్నాయి. అందుకే చాలా జాగ్రత్తగా అడుగు వేయాలి.(Ghaziabad Manhole)

Also Read..GPS Car : OMG.. ప్రాణాలకు మీదకు తెచ్చిన GPS, సముద్రంలోకి దూసుళ్లిన కారు.. షాకింగ్ వీడియో

వానలు పడుతున్న సమయంలో మ్యాన్స్ హోల్స్ ఎంత ప్రమాదకరమో తెలియజెప్పే ఘటన ఒకటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఘజియాబాద్ లో చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు రోడ్డు పక్కన ఫుట్ పాత్ పై నడుచుకుంటూ వెళ్తున్నారు. కొంతదూరం వెళ్లాక ఆ ప్రాంతం అంతా వర్షపు నీటితో నిండిపోయింది. ముందుకెళ్లాలంటే నీళ్లలో నడుచుకుంటూ వెళ్లాల్సిందే. వారికి మరో దారి లేదు. గత్యంతరం లేక ఓ వ్యక్తి నీళ్లలో కాలు పెట్టాడు. అంతే, ఊహించని ప్రమాదంలో చిక్కుకున్నాడు. నీళ్లలో మునిగిపోయిన మ్యాన్ హోల్ లో పడిపోయాడు. ఇది చూసిన వెనకాలే ఉన్న వ్యక్తి షాక్ తిన్నాడు.

నీళ్లలో పడిన వ్యక్తిని కాపాడేందుకు ప్రయత్నించాడు. అందుకోసం అతడు కాలు కింద పెట్టాడు. అంతే, అతడు కూడా మ్యాన్ హోల్ లో దబ్బున పడిపోయాడు. ఇది చూసిన చుట్టుపక్కల జనం షాక్ తిన్నారు. వెంటనే అక్కడికి పరిగెత్తుకుని వచ్చారు. ముందుగా ఓ వ్యక్తిని వారు కాపాడారు. బయటకు లాగేశారు. మరో వ్యక్తి నీళ్లలోనే ఉండిపోయాడు. కొన్ని సెకన్ల వ్యవధి తర్వాత అతడు బయటికి తేలాడు. వెంటనే అక్కడున్న వారు అతడిని కూడా పైకిలాగేశారు. అలా ఆ ఇద్దరు వ్యక్తులు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. దీనికి సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్న ఈ వీడియో చూసి అంతా షాక్ అవుతున్నారు. ఓ మై గాడ్ అని నివ్వెరపోతున్నారు.

Also Read..Kebab : ఘోరాతి ఘోరం.. ప్రాణం తీసిన కబాబ్, ఆ కోపంతో కాల్చి చంపేశారు