Kebab : ఘోరాతి ఘోరం.. ప్రాణం తీసిన కబాబ్, ఆ కోపంతో కాల్చి చంపేశారు

Kebab : కబాబ్ తిన్న తర్వాత రుచిగా లేదని షాపు ఓనర్ తో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత బిల్లు కట్టకుండా అలాగే తమ కారు దగ్గరికి వెళ్తున్నారు.

Kebab : ఘోరాతి ఘోరం.. ప్రాణం తీసిన కబాబ్, ఆ కోపంతో కాల్చి చంపేశారు

Kebab(Photo : Google)

Kebab : మనిషి ప్రాణానికి విలువే లేకుండా పోయింది. చిన్న చిన్న విషయాలకే చంపేస్తున్నారు. అర్థం లేని ఆవేశంలో, పట్టరాని కోపంలో ప్రాణాలు తీసేస్తున్నారు. సాటి మనిషిని మనిషే పొట్టన పెట్టుకుంటున్నాడు. తాజాగా జరిగిన ఓ ఘటన అందరినీ షాక్ కి గురి చేసింది. కబాబ్ రుచిగా లేదని ఇద్దరు వ్యక్తులు రెచ్చిపోయారు. మరో మనిషిని గన్ తో కాల్చి చంపేశారు.

కబార్ రుచిగా లేదని ఇద్దరు వ్యక్తులు ఓ వంట మనిషిని కాల్చి చంపిన దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బరేలీ పట్టణంలో జరిగింది. పట్టణంలోని ప్రేమ్ నగర్ లోని కబాబ్ దుకాణానికి ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చారు. కబాబ్ ఆర్డర్ ఇచ్చారు. దాన్ని తిన్నారు. కబాబ్ తిన్న తర్వాత రుచిగా లేదని షాపు ఓనర్ తో గొడవ పెట్టుకున్నారు. ఆ తర్వాత బిల్లు కట్టకుండా అలాగే తమ కారు దగ్గరికి వెళ్తున్నారు.

Also Read..Bengaluru Techie : అద్దె ఇల్లు కోసం గూగుల్‌లో సెర్చ్ చేసి రూ. 1.6 లక్షలు కోల్పోయిన బెంగళూరు టెక్కీ.. అసలేం జరిగిందంటే?

ఇంతలో షాపు యజమాని తన వంటి మనిషిని వారి దగ్గరికి పంపించాడు. అప్పటికే తీవ్రమైన కోపంలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు వంటమనిషి డబ్బుల కోసం తమ దగ్గరికి రావడంతో విచక్షణ కోల్పోయారు. ఆ ఇద్దరిలో ఒక వ్యక్తి.. ఆవేశంలో ఊగిపోతూ తన దగ్గరున్న తుపాకీతో వంటమనిషిని కాల్చి చంపాడు. వంటి మనిషి స్పాట్ లోనే చనిపోయాడు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది.

ఈ కేసు వివరాలను పోలీసులు వెల్లడించారు. మృతుడిని కబాబ్ మాస్టర్ గా గుర్తించారు. అతడి వయసు 52ఏళ్లు. బుధవారం రాత్రి ప్రియదర్శి నగర్ లోని కబాబ్ షాపు దగ్గర ఈ ఘటన జరిగింది. ఇద్దరు వ్యక్తులు ఓ లగ్జరీ కారులో కబాబ్ షాప్ కి వచ్చారు. ఆ ఇద్దరూ బాగా తాగి ఉన్నారు. మద్యం మత్తులో ఉన్నారు.

కబాబ్ ఆర్డర్ ఇచ్చి తిన్నారు. తర్వాత కబాబ్ రుచిగా లేదంటూ షాపు ఓనర్ అంకుర్ సభర్వాల్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో ఆ ఇద్దరు వ్యక్తులు షాపు ఓనర్ పై దాడి చేశారు. ఆ తర్వాత బిల్లు కట్టకుండానే తమ కారు దగ్గరికి వెళ్లారు. దాంతో షాపు ఓనర్ అంకుర్ సభర్వాల.. తన వంటమనిషి నసీర్ అహ్మద్ ను పిలిచాడు. రూ.120 బిల్లు వారి నుంచి వసూలు చేయాలని చెప్పాడు. ఓనర్ చెప్పడంతో వంటమనిషి నసీర్ అహ్మద్ ఆ ఇద్దరి దగ్గరికి వెళ్లాడు.

Also Read..Madhya Pradesh: వీడియో చూస్తే షాక్ అవుతారు.. సామాన్యుల చేతిలో తుపాకులు, కుటుంబాల గొడవలో ఆరుగురిని కాల్చి చంపారు

అప్పటికే కోపంలో ఉన్న ఆ ఇద్దరు వ్యక్తులు.. వంటమనిషిని చూడగానే మరింత రెచ్చిపోయారు. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకడ తన దగ్గరున్న గన్ తీసుకుని వంటమనిషిని కాల్చాడు. తీవ్ర గాయాలతో వంటమనిషి అక్కడికక్కడే మరణించాడు. ఆ తర్వాత ఆ ఇద్దరు వ్యక్తులు తమ కారులో అక్కడి నుంచి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. హోటల్ లో పని చేసే సిబ్బంది తమ ఫోన్లలో ఆ ఇద్దరు వ్యక్తులను, వారి కారు ఫొటోలు తీశారు. వాటి ఆధారంగా పోలీసులు కారుని, హంతకులను గుర్తించారు.

కారు ఉత్తరాఖండ్ లోని కాశీపూర్ లో ఉన్నట్లు ట్రేస్ చేశారు. హంతకులను మయాంక్ రస్తోగి, తజీమ్ శంషీగా గుర్తించారు. హత్య తర్వాతి రోజున నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. కారు రిజిస్ట్రేషన్ నెంబర్ ఆధారంగా హంతకులను పట్టుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. హత్య, ఆయుధాల చట్టం కింద ఆ ఇద్దరిపై కేసు నమోదు చేసి జైలుకి పంపినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు మయాంక్ రస్తోగీ ఓ వ్యాపారవేత్త కొడుకు. అతడు తన తండ్రికి చెందిన లైసెన్స్డ్ రివాల్వర్ తో వంటమనిషిని హత్య చేశాడు. వంటమనిషి నసీర్ మరణంతో అతడి కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది. కుటుంబ పెద్దను కోల్పోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. మృతుడికి పదేళ్ల కొడుకు ఉన్నాడు.