Viral Video (Photo : Google)
Inhuman Incident : మనుషుల్లో మానవత్వం తగ్గిపోతోంది. జాలి, దయ కనుమరుగు అవుతున్నాయి. ఎవడు ఎలా పోతే నాకేంటి? అనే స్వార్ధం పెరిగిపోతోంది. కళ్ల ముందే సాటి మనిషి కష్టాల్లో ఉన్నా పట్టించుకునే పరిస్థితి లేకుండా పోయింది. తాజాగా జరిగిన ఓ సంఘటన సభ్య సమాజాన్ని షాక్ కి గురి చేసింది. మనిషి.. మరీ ఇంత నిర్దయగా మారిపోయాడేంటి? అనే ఆవేదన వ్యక్తమవుతోంది.
ఓ వ్యక్తి స్పృహ తప్పి పడిపోతే.. మాకేమీ సంబంధం లేదన్నట్లుగా రోడ్డు పక్కన పడేసి.. చేతులు దులుపుకున్నారు ఓ ఆటో డ్రైవర్, అందులోని ప్రయాణికులు. ఉత్తరప్రదేశ్ రాజధాని క్నోలో ఈ అమానుషం చోటు చేసుకుంది.
ఠాకూర్ గంజ్ ప్రాంతం క్యాంపాల్ రోడ్డులో ఈ-రిక్షాలో వెళ్తున్న ఓ యువకుడు స్పృహ తప్పాడు. డ్రైవర్ పక్కనే కూర్చున్న ఆ వ్యక్తిలో చలనం లేదు. దాంతో ఈ రిక్షా డ్రైవర్ వెంటనే తన వాహనాన్ని ఆపేశాడు. అతడిని కదిపాడు. కానీ, అతడు లేవలేదు. వెంటనే అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన ఈ-రిక్షా డ్రైవర్ అత్యంత అమానుషంగా వ్యవహరించాడు. ఆ వ్యక్తికి ఏమైంది? అని కనీసం తెలుసుకునే ప్రయత్నం కూడా చేయకపోవడం అత్యంత దారుణం.
నాకేమీ సంబంధం లేదన్నట్లుగా మూర్చపోయిన వ్యక్తిని రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయాడు. డ్రైవరే కాదు ఆటోలోని ఇతర ప్రయాణికులు కూడా అమానవీయంగా ప్రవర్తించారు. తమకేమీ పట్టనట్లుగా వ్యవహరించారు. ఎలాంటి జాలి దయ లేకుండా నిర్దాక్షిణ్యంగా మూర్చపోయిన వ్యక్తిని తీసుకెళ్లి రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు. ఆటోలో ఉన్న వారు కూడా ఆ వ్యక్తికి ఏమైంది? అని అడగలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Also Read.. Viral Video : ఘోర ప్రమాదం.. బస్సులోంచి జారిపడ్డ యువతి, అక్కడికక్కడే మృతి
ఈ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. అత్యంత అమానవీయంగా వ్యవహరించిన డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. కాగా, మూర్చపోయిన ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఒకవేళ సమయానికి అతడిని ఆసుపత్రికి తీసుకెళ్లి ఉంటే బతికేవాడేమో అని స్థానికులు అంటున్నారు.
#लखनऊ का #थाना_ठाकुरगंज क्षेत्र स्थित कैंपल रोड पर मिला युवक का संदिग्ध परिस्थितियों में शव,ई-रिक्शा से आए कुछ लोगों ने उतार कर शव को रोड पर फेंका पुलिस शव को पीएम के लिए भेज मामले की जांच कर रह@ShoThakurganj @UPPViralCheck@lkopolice @Uppolice @dgpup @DCPWEST1 @CMOfficeUP pic.twitter.com/9nWBfL5z2e
— Osama Razvi, اسامہ ریزوی (@razvi_osama) May 19, 2023