Viral Video: పక్షులకు ఆహారం తినిపించిన చిన్నారి.. అబ్బురపరుస్తున్న వీడియో

చిన్నారుల మనసు స్వచ్ఛమైనది. వారు ఏ పని చేసినా ముద్దొస్తారు. పక్షులు, జంతువులు అంటే చిన్నారులకు చాలా ఇష్టం. వాటిని మనుషులలాగే భావిస్తూ వాటితో ఆడుకుంటారు. వారు చేసే అమాయకపు పనులు చూడముచ్చటగా ఉంటాయి. తాజాగా, ఓ చిన్నారి పక్షుల నోట్లో ఆహారం పెట్టిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

Viral Video: చిన్నారుల మనసు స్వచ్ఛమైనది. వారు ఏ పని చేసినా ముద్దొస్తారు. పక్షులు, జంతువులు అంటే చిన్నారులకు చాలా ఇష్టం. వాటిని మనుషులలాగే భావిస్తూ వాటితో ఆడుకుంటారు. వారు చేసే అమాయకపు పనులు చూడముచ్చటగా ఉంటాయి. తాజాగా, ఓ చిన్నారి పక్షుల నోట్లో ఆహారం పెట్టిన దృశ్యాలకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతోంది.

చాప్ స్టిక్స్ తో ఆ బాలుడు పక్షులకు ఆహారం తినిపించాడు. అతడు ఆహారం పెడుతుంటూ పక్షులు నోరు తెరిచి పోటీ పడ్డాయి. ఈ వీడియోను వావా అఫ్షర్ అనే వ్యక్తి పోస్ట్ చేశాడు. మనసు బాగోలేనప్పుడు ఇటువంటి వీడియోలు చూస్తే ఉత్సాహం వస్తుందని పలువురు నెటిజన్లు కామెంట్లు చేశారు.

ఆకలిగా ఉన్న ఆ పక్షులకు ఆ బాలుడు ఆహారం అందించి, వాటిని కూడా చిన్నపిల్లల్లాగే చూశాడని ఓ నెటిజన్ పేర్కొన్నాడు. ఈ వీడియో చూసి తన కంట్లో నీళ్లు తిరిగాయని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. చిన్నారులు ఏ పని చేసినా చూడముచ్చటగా ఉంటుందని కొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఎంతో ఓపికతో ఆ బాలుడు పక్షులకు ఆహారం అందించిన తీరు అద్భుతమని మరికొందరు కామెంట్లు చేశారు.

Raviteja: సినిమా హిట్ అవ్వాలని కోరుకున్నా.. కానీ ఫెయిల్ అయ్యింది.. రవితేజ కామెంట్!