Leech In Trachea : బాబోయ్.. గొంతులో ఇరుక్కుపోయిన జలగ, 15 రోజులైనా బతికే ఉంది

వెస్ట్ బెంగాల్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 రోజుల పాటు అతడి గొంతులోనే ప్రాణాలతో ఉండిపోయింది. చివరికి డాక్టర్లు ఆపరేషన్ చేసి జలగను తొలగించారు. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు.(Leech In Trachea)

Leech In Trachea : బాబోయ్.. గొంతులో ఇరుక్కుపోయిన జలగ, 15 రోజులైనా బతికే ఉంది

Leech In Trachea : వెస్ట్ బెంగాల్ లో షాకింగ్ ఘటన ఒకటి చోటు చేసుకుంది. ఓ వ్యక్తి గొంతులో జలగ ఇరుక్కుపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 15 రోజుల పాటు అతడి గొంతులోనే ప్రాణాలతో ఉండిపోయింది. చివరికి డాక్టర్లు ఆపరేషన్ చేసి జలగను తొలగించారు. ఆ వ్యక్తి ప్రాణాలను కాపాడారు.

బాధితుడి పేరు సజిన్ రాయ్ (49). మిరిక్ నివాసి. 15 రోజుల క్రితం పర్వత ప్రాంతం వైపు వెళ్లాడు. ఆ సమయంలో అతడికి దాహం వేసింది. వెంటనే ఓ ఊట దగ్గరికి వెళ్లాడు. అందులో నీరు తాగాడు. ఈ క్రమంలో ఊహించని విధంగా అతడి గొంతులోకి జలగ వెళ్లింది. అలాగే గొంతులో ఇరుక్కుపోయింది. తర్వాత అది శ్వాస నాళంలోకి వెళ్లింది. అప్పటి నుంచి అతడు తీవ్ర అసౌకర్యానికి గురయ్యాడు. చాలా ఇబ్బంది పడ్డాడు. ఏం జరిగిందో అర్థం కాక ఆసుపత్రికి వెళ్లాడు.

Also Read..Pencil Girl Dies : తల్లిదండ్రులూ, బీకేర్ ఫుల్.. పెన్సిల్ పొట్టు గొంతులో ఇరుక్కుని ఆరేళ్ల చిన్నారి మృతి

ఈఎన్‌టీ డాక్టర్లు అతడిని పరిశీలించారు. టెస్టులు చేశారు. అతడి గొంతులో జలగ ఉన్నట్లు గుర్తించి షాక్ అయ్యారు. వెంటనే ఆపరేషన్ కు ఏర్పాట్లు చేశారు. సుమారు గంటన్నర పాటు శ్రమించి శస్త్రచికిత్స చేసి విజయవంతంగా జలగను తొలగించారు డాక్టర్లు. అయితే, ఆ జలగ ఇంకా బతికే ఉండటంతో డాక్టర్లు నివ్వెరపోయారు. రెండు వారాల పాటు శ్వాసనాళంలో ఇరుక్కుపోయిన జలగ ఇంకా ఎలా బతికే ఉందోనని డాక్టర్లు ఆశ్చర్యపోయారు.(Leech In Trachea)

Also Read..Telangana: కొబ్బరి ముక్క గొంతులో ఇరుక్కుని ఏడాది వయసున్న చిన్నారి మృతి

తన గొంతులోని జలగను తొలగించి, తనకు ప్రాణం నిలిపినందుకు నార్త్ బెంగాల్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ డాక్టర్లకు సజిన్‌ రాయ్‌ కృతజ్ఞతలు తెలిపాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు డాక్టర్లు. ఈ శస్త్రచికిత్స అత్యంత అరుదైన కేసుగా డాక్టర్లు అభివర్ణించారు. 15 రోజుల పాటు శ్వాసనాళంలో ప్రాణంతో జలగ ఉన్న ఘటనపై డాక్టర్లు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తన 40ఏళ్ల కెరీర్ లో ఇలాంటి ఇన్సిడెంట్ చూడలేదన్నారు.

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.