Viral Video
Viral Video: ప్రతిభావంతులైన కళాకారులకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తరుచూ వైరల్ అవుతుంటాయి. తమకు వచ్చిన కళతో ప్రజలను మంత్రముగ్దులను చేస్తుంటారు ఆర్టిస్టులు. తాజాగా, ఓ వ్యక్తి ఇసుకతో క్షణాల్లో హనుమంతుడి బొమ్మ వేసి అందరినీ అలరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
జై శ్రీరాం అనే ఫేస్ బుక్ గ్రూపులో ఈ వీడియోను పోస్ట్ చేశారు. సిమెంటు నేలపై ఇసుకపోసి, బట్టతో దాన్ని కదిలిస్తూ హనుమంతుడి చిత్రాన్ని తీర్చిదిద్దాడు ఆ కళాకారుడు. ఇది ఎలా సాధ్యమైందని అందరూ అడిగేలా దాన్ని చెకాచెకా రూపొందించాడు ఆ వ్యక్తి. కిరీటం, గదతో ఉన్న హనుమంతుడు భక్తులకు అభయం ఇస్తున్నట్లు ఈ చిత్రం ఉంది.
దీన్ని రూపొందించిన ఆ యువకుడి ప్రతిభను వర్ణించడానికి మాటలు చాలట్లేదంటూ కొందరు కామెంట్లు చేశారు. ‘చాలా అద్భుతంగా చిత్రాన్ని వేశాడు.. జై శ్రీరాం’ అంటూ మరికొందరు పేర్కొన్నారు. హనుమండిపై భక్తితోనే ఆ యువకుడు ఈ కళను నేర్చుకుని ఉం డొచ్చని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు.