Gali Janardhan Reddy: కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి.. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో ఏర్పాటు

బెంగళూరులోని తన నివాసంలో గాలి జనార్దన్ రెడ్డి ఆదివారం ఈ ప్రకటన చేశాడు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని, తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు.

Gali Janardhan Reddy: కొత్త పార్టీ ప్రకటించిన గాలి జనార్దన్ రెడ్డి.. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో ఏర్పాటు

Gali Janardhan Reddy: కర్ణాటక మాజీ మంత్రి, వివాదాస్పద మైనింగ్ వ్యాపారి గాలి జనార్దన్ రెడ్డి కొత్త పార్టీ పెట్టబోతున్నట్లు ప్రకటించాడు. ‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో నూతన పార్టీ స్థాపిస్తున్నట్లు వెల్లడించాడు. బెంగళూరులోని తన నివాసంలో ఆదివారం ఈ ప్రకటన చేశాడు. రాబోయే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ పోటీ చేస్తుందని, తాను గంగావతి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తానని ప్రకటించాడు.

United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

గతంలో బీజేపీలో కొనసాగిన గాలి జనార్దన్ రెడ్డిని ఆ పార్టీ కొంతకాలంగా పక్కనపెట్టింది. పార్టీలో ఎలాంటి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. దీంతో చాలా కాలం నుంచి ఆయన బీజేపీపై అసంతృప్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి బయటికి వచ్చిన ఆయన పార్టీ ఏర్పాటు చేశారు. ఇకపై బీజేపీతో తనకు ఎలాంటి సంబంధం లేదన్నాడు. తాను ఆ పార్టీలో సభ్యుడిని కాదని తేల్చి చెప్పాడు. ‘‘‘కల్యాణ రాజ్య ప్రగతి పక్ష’ పేరుతో కొత్త పార్టీ స్థాపిస్తున్నా. నా ఆలోచనలకు తగినట్లుగా ఈ పార్టీని ఏర్పాటు చేస్తున్నా. నాకు ప్రజల ఆశీర్వాదం ఉంది. మా పార్టీ ద్వారా కర్ణాటక సంక్షేమ రాజ్యంగా నిలుస్తుంది. రాజకీయాల్లో నేను ఓటమిని అంగీకరించలేను’’ అని గాలి జనార్దన్ రెడ్డి వ్యాఖ్యానించాడు. గతంలో గాలి బళ్లారి నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. అయితే, తాజాగా గంగావతి నుంచి పోటీ చేయబోతున్నట్లు చెప్పాడు.

PAN-Aadhaar: మార్చి 31లోపు ఆధార్ లింక్ చేయకపోతే పాన్ రద్దు.. ఐటీ శాఖ చివరి హెచ్చరిక

గాలి జనార్దన్ రెడ్డికి బళ్లారి, విజయ నగరం, కొప్పల్, రాయచూర్, యాదగిరి, బీదర్ జిల్లాల్లో భారీ సంఖ్యలో మద్దతుదారులు ఉన్నారు. గతంలో ఆయన మంత్రిగా పనిచేశారు. అయితే, బళ్లారి ప్రాంతంలో అక్రమ మైనింగ్ కేసులో అరెస్టు కావడంతో బీజేపీ ఆయనను పక్కనపెట్టింది. దీంతో గాలి కొత్త పార్టీ దిశగా అడుగులేశారు. వచ్చే ఏడాది కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కొత్త పార్టీ ఏర్పాటు రాజకీయ మార్పులకు కారణమవుతుందేమో చూడాలి. ఎందుకంటే అధికార బీజేపీలో గాలికి సన్నిహితులు చాలా మందే ఉన్నారు. వాళ్లంతా ఆ పార్టీని వీడి గాలితో నడుస్తారో లేదో ఎన్నికల సమయంలో తేలుతుంది.