United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

మంచు తుపాన్ కారణంగా అమెరికా స్తంభించిపోయింది. అనేక రాష్ట్రాలు మంచు, చలి ప్రభావంతో వణికిపోతున్నాయి. ఉష్ణోగ్రతలు పలు చోట్ల మైనస్ డిగ్రీలకు చేరుకున్నాయి. అమెరికా వ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది ప్రజలు కరెంటు లేక చీకట్లోనే అల్లాడుతున్నారు.

United States: అమెరికాలో మంచు తుపాన్ ధాటికి 18 మంది మృతి.. కరెంటు లేక చీకట్లోనే 17 లక్షల మంది

United States: అమెరికాను ఈ శీతాకాలం వణికిస్తోంది. మంచు తుపాన్, చలి ప్రభావంతో అతలాకుతలమవుతోంది. మంచు తుపాన్ ధాటికి అమెరికాలో తాజాగా 18 మంది మరణించారు. దేశవ్యాప్తంగా 2,700కుపైగా విమానాలు రద్దయ్యాయి. తీవ్రంగా కురుస్తున్న మంచు కారణంగా అనేక ప్రాంతాల్లో కరెంటు సరఫరా నిలిచిపోయింది.

Rahul Gandhi: దేశంలో ఉన్నది మోదీ ప్రభుత్వం కాదు.. అదానీ, అంబానీలది..

అమెరికా వ్యాప్తంగా దాదాపు 17 లక్షల మంది ప్రజలు కరెంటు లేక చీకట్లోనే అల్లాడుతున్నారు. అసలే మంచు తుపాన్, చలి గాలులతోనే ఇబ్బంది పడుతున్న ప్రజలకు కరెంటు కోతలు మరింత కష్టాన్ని కలిగిస్తున్నాయి. వాషింగ్టన్ పరిధిలోని బఫెలో పట్టణంలో అయితే, తుపాన్ ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. ఇలాంటి కొన్ని ప్రాంతాల్లో అత్యవసర సేవలు కూడా అందించలేని పరిస్థితి ఉంది. స్థానికులకు సహాయం అందించేందుకు సహాయక బృందాలు చేరుకోవడం కూడా కష్టమవుతోంది. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో పలు ప్రమాదాలు జరిగాయి. అనేక కార్లు ఢీకొన్నాయి. చెట్లు కూలిపోయాయి. ఇప్పటికీ కొన్ని చోట్ల రోడ్లపై వందలాది మంది వాహనాల్లో చిక్కుకుపోయి ఉన్నారని అధికారులు తెలిపారు. వేల కొద్ది విమానల రద్దు కూడా అమెరికాలో పెద్ద సమస్యగా మారింది.

Jammu kashmir: ఉగ్ర కుట్రను భగ్నం చేసిన భారత బలగాలు

చివరి నిమిషంలో విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి క్రిస్మస్ సెలవులకు సొంత ప్రాంతాలకు వెళ్దామనుకుంటున్న వాళ్లకు మంచు తుపాన్ ఆటంకంగా మారింది. అలాగే వాతావరణం అనుకూలించకపోవడంతో విద్యుత్ ఉత్పత్తి కూడా సక్రమంగా జరగడం లేదు. దీంతో అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. తాజా పరిణామాలతో దేశవ్యాప్తంగా క్రిస్మస్ సంబరాలకు ఆటంకం కలుగుతోంది. మంచు కారణంగా లక్షలాది ప్రజలు క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకోలేకపోతున్నారు. అనేక ఈవెంట్స్ నిలిచిపోయాయి. వ్యాపార కార్యకలాపాలు స్తంభించాయి.