డెలివరీ బాయ్స్ కోసం ఇంటిముందు స్నాక్స్.. వైరల్ వీడియో

  • Published By: veegamteam ,Published On : December 9, 2019 / 05:54 AM IST
డెలివరీ బాయ్స్ కోసం ఇంటిముందు స్నాక్స్.. వైరల్ వీడియో

Updated On : December 9, 2019 / 5:54 AM IST

అమెరికాలో ఓ ఇంటికి అమెజాన్ నుంచి ఒక ఐటమ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన డెలివరీ బాయ్ అక్కడ వారిచ్చిన సర్ప్రైజ్ చూసి చాలా సంతోషపడ్డాడు. ఆ సర్ప్రైజ్ ఏంటా అని ఆలోచిస్తున్నారా..? ఐటమ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్లిన ఇంటిముందు చైర్ లో ఓ బాస్కెట్ పెట్టి.. అందులో వాటర్ బాటిళ్లు, కూల్ డ్రింక్స్, రకరకాల స్నాక్స్ పెట్టి ఉంచారు.

అయితే అతనికెందుకు సంతోషం అనుకుంటున్నారా.. అవి ఆ డెలివరీ బాయ్ కోసమే అక్కడ పెట్టారు. అది అతనికి అర్ధం కావడం కోసం.. పైన పేపర్ మీద నీకు నచ్చిన స్నాక్స్ ఫ్రీగా తీసుకుని తినచ్చు అని రాసి పెట్టారు. ఇక అందులోంచి అతనికి కావాలిసిన కోన్ని స్నాక్స్ తీసుకుని డాన్స్ చేస్తు వెళ్లిపోయాడు.

అమెరికా… విల్మింగ్టన్‌ లోని డెలావేర్లో ఉన్న ఇంటి ముందు ఓ మహిళ ఇలా ఫ్రీ ఫుడ్ పెట్టింది. ఎందుకంటే క్రిస్మస్‌ వచ్చేస్తుంది కదా.. ఈ సందర్భంగా ఆ మహిళ డెలివరీ బాయ్స్ కోసం ఇలా ఫ్రీ ఫుడ్ ఇస్తుంది. దీంతో నెటిజన్లు ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.