baby elephant : బేబీ ఎలిఫెంట్ క్యూట్ వీడియో.. కేర్ టేకర్ చేతిని చుట్టేసి..

జంతువులు చిన్నగా ఉన్నప్పుడు భలే ముద్దొస్తాయి. చిత్ర విచిత్రమైన చేష్టలు చేస్తూ ముచ్చటగా అనిపిస్తాయి. ఓ బేబీ ఎలిఫెంట్ క్యూట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అది ఏం చేసింది?

baby elephant

baby elephant :  సాధారణంగా చిన్నపిల్లలు నిద్రపోతున్నప్పుడు చాలా క్యూట్ గా ఉంటారు. నిద్రలో ఎంతో అమాయకంగా వాళ్లు ఇచ్చే ఎక్స్ ప్రెషన్స్ ముచ్చటగొల్పుతాయి. అయితే ఓ పిల్ల ఏనుగు (baby elephant) నిద్రపోతున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. అందరి మనసులు దోచుకుంటోంది.

bull attack : మహిళపై ఎద్దు దాడి.. ప్రాణాలకు తెగించి కాపాడిన బాలుడి వీడియో వైరల్

మనం జంతువుల్ని(animals) ఎంత మచ్చిక చేసుకుంటే అవి అంతగా కలిసిపోతాయి. వాటితో విడదీయరాని అనుబంధం ఏర్పడుతుంది. ఇక ఏనుగుల (elephant) విషయానికి వస్తే భారీ ఆకారంతో ఉన్నా చాలామంది వాటిని ఇష్టపడతారు. వాటిని సంరక్షించడం అంత సుళువు కూడా కాదు. వాటి ఆహారం, ఆరోగ్యం విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకుంటారు. ఇక పిల్ల ఏనుగు అంటే పసిదానిలాగనే కాపాడతారు. తాజాగా ఓ పిల్ల ఏనుగు తన సంరక్షకురాలి (caretaker) చేయి పట్టుకుని నిద్రపోతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియో చూడటానికి ఎంతో ముచ్చటగా ఉంది. చక్కగా పరిచిన గడ్డిలో తన సంరక్షకురాలి చేతిని తన బుజ్జి తొండంతో చుట్టేసి పిల్ల ఏనుగు నిద్రపోవడానికి ప్రయత్నం చేస్తోంది. సంరక్షురాలు కూడా అంతే ప్రేమగా తన చేయిని అందించింది. ఈ క్యూట్ వీడియో (cute video) నెటిజన్లను (netizens) ఎంతగానో ఆకట్టుకుంది.

good thieves : దొంగిలించిన నగదు తిరిగిచ్చేసి పోలీసులకు షాక్ ఇచ్చిన దొంగలు.. వింత సంఘటన వైరల్

ఇక ఈ వీడియోని @buitengebieden అనే యూజర్ ట్విట్టర్ లో షేర్ చేయడంతో వైరల్ గా మారింది. ఆ పిల్ల ఏనుగుపట్ల చాలామంది ఇష్టాన్ని వ్యక్తం చేశారు. అచ్చంగా పసిపాపల నిద్రపోతోందని కొందరు.. వారి అనుబంధం ఎంతో అందంగ ఉందని మరికొందరు కామెంట్లు పెట్టారు.