వైరల్ వీడియో: గంటసేపు కారు డ్రైవ్ చేసిన కుక్క

  • Published By: veegamteam ,Published On : November 24, 2019 / 03:27 AM IST
వైరల్ వీడియో: గంటసేపు కారు డ్రైవ్ చేసిన కుక్క

Updated On : November 24, 2019 / 3:27 AM IST

కుక్క అంటేనే విశ్వాసం గల జంతువు. ఇతర ఏ జంతువులకూ లేని తెలివి కుక్కలకు ఉంటుంది. అయితే కుక్కలకు మనుషులకున్నంత జ్ఞానం, ఆలోచన ఉంటోందంటారు. అది కచ్చింతంగా నిజమని ఈ ఘటన ద్వారా తెలింది. ఫ్లోరిడాలోని ఓ కుక్క కారు  డ్రైవ్ చేసి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కారు డ్రైవ్ చేయడం అంటే నార్మల్ గా కాదు.. రివర్స్‌ లో అది కూడా అక్కడే సర్కిల్ లో గంటపాటు నడిపింది.  

ఫ్లోరిడాలోని అన్నె సబొల్ అనే మహిళకు మ్యాక్స్ అనే కుక్క ఉండేది. అది లాబ్రడార్ రిట్రీవర్ జాతికి చెందినది. అయితే ఆ కుక్క అన్నె సబొల్ కారులోకి ఎలా ఎక్కిందో తెలియదు కానీ.. కారును రివర్స్‌లో గంట పాటు డ్రైవింగ్ చేసిందట. దీంతో కారు ఒకే చోట గుండ్రగా గంట పాటు తిరిగింది. ఆ క్రమంలో అన్నె సబొల్ ఇంటి పక్కన ఉండే మరొక ఇంటి పోస్ట్‌ బాక్స్‌ ను ఆ కారు ఢీకొట్టింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకి వచ్చి కారును ఆపి డోర్ తీసి చూడగా.. అందులో కుక్క కనిపించింది.

దీంతో పోలీసులు ఒక్కసారిగా ఫాక్ అయ్యారు. ఇక పక్కింటి ఓనర్‌ కు కొత్త పోస్టు బాక్స్ కొనిస్తానని ఆమె చెప్పింది. పోలీసులు కూడా అన్నె సబొల్‌ పై ఎలాంటి కేసూ నమోదు చేయలేదు. ఇక కుక్క కారును డ్రైవ్ చేస్తున్న సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి దాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.