ట్రంప్ సైన్‌పై టాప్ ట్రోల్స్: డాక్టర్లు కూడా డీకోడ్ చెయ్యలేరట!

  • Published By: veegamteam ,Published On : February 25, 2020 / 05:49 AM IST
ట్రంప్ సైన్‌పై టాప్ ట్రోల్స్: డాక్టర్లు కూడా డీకోడ్ చెయ్యలేరట!

Updated On : February 25, 2020 / 5:49 AM IST

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రెండు రోజుల భారత్ పర్యటనకు తన కుటుంబంతో కలిసి విచ్చేశారు. వీరిని స్వాగతించటం కోసం ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా సర్దార్ వల్లాభాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి అధ్యక్షుడు ట్రంప్, అమెరికా ప్రథమ మహిళా మెలానియా ట్రంప్ కి ఘనంగా స్వాగతం పలికారు.
  
భారత్ పర్యటనకు వచ్చిన కొద్ది నిమిషాల్లోనే ట్రంప్ పై సోషల్ మీడియాలో #NamasteyTrump పేరుతో ట్విట్టర్ లో లక్షలాది ట్వీట్లు వచ్చాయి. ట్రంప్ భారత్ పర్యటన పై నెటిజన్లు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలోనే సబర్మతి ఆశ్రమంలో ట్రంప్ చేసిన సంతకం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ట్రంప్, ప్రధాని నరేంద్ర మోడీతో కలిసి అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి నేరుగా సబర్మతి ఆశ్రమాన్ని సందర్శించారు. అక్కడ జాతిపిత మహాత్మా గాంధీకి నివాళులు అర్పించారు. అనంతరం సందర్శకుల పుస్తకంలో “To My great friend Prime Minister Modi – Thank you for this wonderful visit” అని రాసి సంతకం చేశారు. 

trump

ఆ సంతకం చూటానికి చిన్నపిల్లల పిచ్చి గీతలుగా, భూకంపం వచ్చిన తర్వాత రిక్టర్ స్కేల్ పై నమోదైన గీతలుగా, సముద్రం అల, ఈసీజీ రిపోర్ట్స్ లాగా ఉన్నాయి అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ ట్విట్లు వైరల్ అవుతున్నాయి.