‘పెళ్లి’అంటే సిగ్గుపడాలా? ట్రెండ్ మారింది : మండపానికి డ్యాన్స్ వేస్తూ వచ్చిన వధువు..వైరల్ మీడియో

‘పెళ్లి’ మాట వినిపిస్తే చాలు ఆడపిల్లలు తుర్రుమంటూ పారిపోయేవారు. కానీ ఇప్పుడు కాలం మారింది. కాలంతో పాటు కొత్త కొత్త ట్రెండ్ లు వచ్చేశాయి. అన్ని రంగాల్లోను తమదైన ముద్ర వేస్తున్న ఆడపిల్లలు ‘పెళ్లి’ పేరు చెబితే పాతకాలం ఆడపిల్లల్లా పారిపోవటంలేదు. పెళ్లి కొడుకును తామే నిర్ణయించుకుంటున్నారు. తమ పెళ్లి ఎలా ఉండాలో డిజైన్ చేసుకుంటున్నారు.
గతంలో పెళ్లికూతురికి పెళ్లి బట్టలు కొనాలంటే పెద్దవారే కొనేవారు. కానీ ఇప్పుడు తమ పెళ్లి బట్టల్ని తామే సెలక్ట్ చేసుకుంటున్నారు. స్వయంగా డిజైన్ చేసుకుంటున్నారు. పెళ్లి బట్టలు నుంచి నగలు…అలంకరణ..వంటి ముఖ్యమైనవి వారే స్వయంగా చూసుకుంటున్నారు. ఫ్రీ వెడ్డింగ్ షూట్ లతో అద్దరగొట్టేస్తున్నారు.
అంతేకాదు..పెళ్లి మండపానికి రావటంలో కూడా పెళ్లి కుమార్తెలు తమదైన ట్రెండ్ ను క్రియేట్ చేస్తున్నారు. పాత కాలంలో ముత్తయిదువలు పెళ్లి కూతుర్ని మండపానికి తీసుకొచ్చేవారు. అలా మండపానికి వచ్చే పెళ్లి కూతురు తలవంచుకుని.. సిగ్గుపడుతూ..చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ వచ్చి పెళ్లి పీటలపై తల వంచుకుని కూర్చునేది. అంతేకాదు పెళ్లి పీటలపై సిగ్గుపడుతూ కూర్చుని తలకూడా పైకి ఎత్తేవారు కాదు. కానీ ఈనాటి వధువులు పెళ్లి జరుగుతున్నంతసేపు పెళ్లికొడుకుతో మాట్లాడుతూ..నవ్వుతూ జోకులు వేసుకుంటూ పెళ్లి తంతును ఎంజాయ్ చేస్తున్నారు. కానీ నేటి ఆధునిక పెళ్లి కూతురు ట్రెండ్ మారింది. డాన్స్ లు వేసుకుంటూ పెళ్లి మండపానికి వస్తున్నారు. సంగీత్ కార్యక్రమంలో భర్తతో కలిసి చక్కగా స్టెప్పులేస్తున్నారు.
అలా కేరళలోని కొచ్చిలో ఓ పెళ్లి కూతురు పెళ్లి మండపానికి డ్యాన్స్ లు వేసుకుంటూ వచ్చింది. ఆ డ్యాన్సింగ్ వధువు పేరు అంజలి. సంప్రదాయా దుస్తుల్లో డ్యాన్స్ వేసుకుంటూ వచ్చిన వధువును చూసి అందరూ మైమరచిపోయారు. అంతేకాదు కాబోయే భర్త కూడా ఆశ్చర్యంగా నోరెళ్లబెట్టి చూస్తుండిపోయాడు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ డ్యాన్సింగ్ వధువు వీడియో ఫేస్ బుక్ లో 75వేల షేర్లు..ట్విట్లర్ లో 50వేలకు పైగా నెటిజన్లు చూశారు.
Be prepared folks. This is Year 2020. Brides will no more be shy or coy on their big days. See how a bride makes her entrance for her wedding in Cannor, Kerala.????? pic.twitter.com/y9ZZjnYEpu
— Karan Kapoor (@karannkapoor18) January 28, 2020
కాగా డాన్స్ వేసుకుంటూ వచ్చిన వధువుని చూసిన పెద్దవారు ‘‘హా..ఇదేమీ చోద్యం..కలికాలం..మా కాలంలో అయితే వంచిన తల ఎత్తేవాళ్లమా’’అనుకుంటూ బుగ్గలు నొక్కుకుంటున్నారు. మగవారైతే హన్నన్నా..పిదపకాలం పిదప బుద్దులూనూ..అంటూ ముక్కుమీద వేలేసుకునేవాళ్లు లేకపోలేదు.
కాలంతో పాటు తమ అభిప్రాయాలను మార్చుకునే వారు..కాలం మారింది. దానితో పాటు మనమూ మారాలి..ఈనాటి పిల్లలు మన కష్టాన్ని తగ్గిస్తున్నారు. తమ పెళ్లిని తామే డిజైన్ చేసుకుంటున్నారు అనుకుంటూ పాజిటివ్ గా ఆలోచిస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా ట్రెండ్ మారింది. పెళ్లిని ఓ తంతుగా కాకుండా నేటి వధువులు చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు.