Funny Parrot : కాపాడమంటూ ఓ ఇంట్లోంచి మహిళ అరుపులు.. లోనికి వెళ్లి చూసిన పోలీసులు షాక్

రక్షించమంటూ ఓ ఇంట్లోంచి మహిళ అరుపులు వింటే ఎవరైనా ఏమనుకుంటారు? ఎవరో లేడీ ప్రమాదంలో ఉంది అనుకుంటారు. అలాగే అనుకుని ఇరుగుపొరుగువారు పోలీసులకు కంప్లైంట్ చేశారు. తీరా అక్కడికి వచ్చి చూసిన పోలీసులు ఆశ్యర్యపోయారు. అసలింతకీ అక్కడ ఏం జరిగింది?

Funny Parrot : కాపాడమంటూ ఓ ఇంట్లోంచి మహిళ అరుపులు.. లోనికి వెళ్లి చూసిన పోలీసులు షాక్

funny parrot

Updated On : April 8, 2023 / 11:49 AM IST

funny parrot : ఇంట్లోంచి మహిళ అరుపులు వినపడితే ఎవరైనా ఆమె ఆపదలో ఉంది అనుకుంటారు. అలాగే భావించిన కొందరు పోలీసులకు సమాచారం అందించారు. పరుగు పరుగున అక్కడికి వచ్చిన పోలీసులు విషయం తెలుసుకుని షాకయ్యారు.  సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఇంట్రెస్టింగ్ స్టోరీ చూడండి.

Ice Cream Seller Tricks : ఐస్ క్రీం అమ్మేవాడి ట్రిక్స్‌కి బిక్కమొహం వేసిన చిన్నారి..వీడియో వైరల్

డిసెంబర్ 29న ఫ్లోరిడా (Florida ) ప్రాంతం.. షెరిఫ్ (sheriff) అనే వ్యక్తి ఇంట్లోంచి ఓ మహిళ తనను కాపాడమంటూ అరవడం అతని ఇరుగుపొరుగువారు విన్నారు. రింగ్ వీడియో డోర్ బెల్ యాప్ లో (Ring video doorbell app) క్యాప్చర్ కాబడిన ఫుటేజ్ ద్వారా ఓ మహిళ ఏదో ప్రమాదంలో ఉంది అని గ్రహించిన నైబర్స్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు షెరిఫ్ ఇంటికి చేరుకున్నారు. షెరిష్ అప్పుడు తన ఇంటిముందు భార్య కారు రిపేర్ చేస్తున్నాడు. షెరిఫ్ దగ్గరకు వచ్చిన పోలీసులు ఇంట్లో బంధించబడిన ఆ మహిళను బయటకు తీసుకుని రమ్మని అడిగారు. అదే సమయంలో మరలా ఆ మహిళ అరుపు వినిపించింది. షెరిఫ్ లోనికి వెళ్లి రామచిలుక (parrot)  రాంబోతో (Rambo) బయటకు వచ్చాడు. అందరూ ఒక్కసారిగా ఆశ్యర్యపోయారు. అప్పటి వరకు రక్షించమని అరచిన మహిళ కంఠం రామచిలుకది అని తెలుసుకుని నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

boy scary video : 27 అంతస్తుల మధ్య బాలుడి ఫీట్లు.. గుండె ఆగిపోతుందేమో అనిపించే వీడియో వైరల్

షెరిఫ్ 40 ఏళ్లుగా ఓ రామచిలుకను పెంచుతున్నాడు. అతను దానికి పాడటం, మాట్లాడటం నేర్పించాడు. ఒక్కోసారి అది తనను రక్షించమని కూడా అరుస్తూ ఉంటుంది. ఆ అరుపులు వినే పొరుగింటివారు పోలీసులకు ఫోన్ చేసారు. మొత్తానికి రాంబోని చూసిన పోలీస్ అధికారులు కాసేపు నవ్వుకున్నారు. అందరికీ విషయం అర్ధమైంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.  కొందరు 40 ఏళ్లుగా షెరిఫ్ ఇంట్లో రామచిలుక ఉంటే ఇరుగుపొరుగువారికి ఎందుకు తెలియలేదు అని ప్రశ్నించారు. పోలీసులకు కూడా నవ్వు తెప్పించిన సంఘటన అని కొందరు అభిప్రాయపడ్డారు.