Heavy Rains : బంగాళాఖాతంలో మరో అల్పపీడనం.. వచ్చేనెల 2వరకు వానలేవానలు.. ఈ జిల్లాల్లో హైఅలర్ట్..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండని.. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తాయని..

Heavy Rains
Heavy Rains : తెలంగాణలో వర్షాలు దంచికొడుతున్నాయి. బుధ, గురువారాల్లో కామారెడ్డి, మెదక్, నిజామాబాద్ సహా పలు జిల్లాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆయా జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు చేరి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా కామారెడ్డి జిల్లా భారీ వర్షాలకు అతలాకుతలం అయింది. జిల్లా వ్యాప్తంగా 130 కోట్లకుపైగా నష్టం జరిగినట్లు అధికారులు ప్రాథమిక అంచనా వేశారు. 32,907 ఎకరాలకుపైగా పంట నీటమునిగింది.
భారీ వర్షాల కారణంగా బిక్కనూర్ – తలమాడ్ల మధ్య దెబ్బతిన్న రైల్వే ట్రాక్ పునరుద్దరణ పనులు కొనసాగుతున్నాయి. కామారెడ్డి – నిజామాబాద్, సికింద్రాబాద్ – నాందేడ్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, రెండు రోజులుగా వర్షాలు తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడిప్పుడే పరిస్థితులు చక్కబడుతున్నాయి. భారీ వర్షాలతో ఇబ్బందులు పడిన ప్రజలుసైతం కాస్త ఊపిరిపీల్చుకుంటున్నారు. ఇలాంటి సమయంలో వాతావరణ శాఖ మరో బాంబు పేల్చింది. బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడబోతుందని, వచ్చేనెల 2వ తేదీ వరకు పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
సెప్టెంబరు 2వ తేదీ తర్వాత బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీని ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. శనివారం అదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మంచిర్యాల, మెదక్, ములుగు, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల వరంగల్ జిల్లాల్లో అక్కడక్కడ వర్గాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఆదివారం ఆదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, జగిత్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ఖమ్మం. ఆసిఫాబాద్, వహబూబాబాద్, మంచిర్యాల, మెదల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల వరంగల్ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పింది. హైదరాబాద్, జనగాం, జోగులాంబ. గద్వాల, మహబూబ్ నగర్, మేడ్చల్ మల్కాజ్ గిరి, నాగర్ కర్నూల్, నారాయణపేట, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట, వికారాబాద్, వనపర్తి జిల్లాల్లో అక్కడక్కడ బలమైన ఈదురుగాలులు వీచే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
సెప్టెంబర్ 1న అదిలాబాద్, కొత్తగూడెం హన్మకొండ, జనగాం, జయశంకర్ భూపాలపల్లి, ఆసిఫాబాద్, ములుగు, వరంగల్, జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వానలు పడుతాయని తెలిపింది.
సెప్టెంబర్ 2న అదిలాబాద్, కొత్తగూడెం, హన్మకొండ, హైదరాబాద్, జగిత్యాల, జనగాం, భూపాలపల్లి, గద్వాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మహబూబాబాద్, మహబూబ్నగర్, మంచిర్యాల, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, ములుగు, నాగర్ కర్నూల్, నారాయణపేట, సిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్ధిపేట వికారాబాద్, వనపర్తి, వరంగల్, భువనగిరి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలున్నాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.