జూబ్లీహిల్స్ బైపోల్.. దీపక్‌రెడ్డికి మరో ఛాన్స్‌ ఇచ్చిన బీజేపీ.. 2023 ఎన్నికల్లో ఆయనకు ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసా?

తెలంగాణ జూబ్లీహిల్స్‌ బై ఎలక్షన్ లో బీజేపీ అభ్యర్థి విషయంలో ఉత్కంఠ వీడింది. అనేకమంది ఆశావహులు ఉన్నప్పటికీ, వివిధ సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని భారతీయ జనతా పార్టీ దీపక్‌రెడ్డి పేరు ఫైనల్ చేశారు.

  • Published By: Mahesh T ,Published On : October 15, 2025 / 01:39 PM IST

తెలంగాణలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఉపఎన్నికలో భారతీయ జనతా పార్టీ తమ అభ్యర్థిని ప్రకటించింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన దీపక్‌రెడ్డికే మరోసారి అవకాశం కల్పించింది.

ప్రస్తుతం జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బరిలో దీపక్‌రెడ్డి (బీజేపీ) తో పాటు నవీన్ యాదవ్ (కాంగ్రెస్), మాగంటి సునీత (బీఆర్ఎస్) ఉన్నారు. ఈ ఉపఎన్నికను రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. విజయం కోసం హోరాహోరీగా తలపడుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన దీపక్‌రెడ్డి 25,866 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

Dec-2023 Assembly Constituency 61 - Jubilee Hills