Traffic Restrictions : హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే..

Traffic Restrictions : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా గణేశ్ నిమజ్జనాలను పురస్కరించుకొని సెప్టెంబర్ 5వ తేదీ వరకు నగరంలోని పలు ప్రాంతాల్లో..

Traffic Restrictions : హైదరాబాద్‌లో సెప్టెంబర్ 5వరకు ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. ప్రత్యామ్నాయ మార్గాలివే..

Traffic Restrictions

Updated On : August 30, 2025 / 1:55 PM IST

Traffic Restrictions : వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం నుంచి గణేశ్ నిమజ్జనాలు ప్రారంభమయ్యాయి. దీంతో విగ్రహాల రద్దీని దృష్టిలో పెట్టుకొని ట్యాంక్ బండ్ పరిసర ప్రాతాల్లో సెప్టెంబర్ 5వ తేదీ వరకు పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధింస్తున్నట్లు తెలిపారు. ఆయా ప్రాంతాల మీదుగా తమ గమ్యస్థానాలకు చేరుకునే నగరవాసులు ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించుకొని ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలని కోరారు.

Also Read: Heavy Rain Alert : వామ్మో.. బంగాళాఖాతంలో మరో మూడు అల్పపీడనాలు.. అతిభారీ వర్షాలు కురవబోతున్నాయ్..

ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..

♦ ఎన్టీఆర్ మార్గ్, పీపుల్స్ ప్లాజా, పీవీఎన్ఆర్ మార్గ్ లో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉండడంతో మధ్యాహ్నం 3గంటల నుంచి రాత్రి వరకు ఆంక్షలు వర్తిస్తాయి.
♦ కర్బలా మైదాన్ నుండి వచ్చే ట్రాఫిక్‌ను అప్పర్ ట్యాంక్‌బండ్ వైపు అనుమతించ బడవు. ఈ వాహనాలు కవాడిగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.
♦ పంజాగుట్ట, రాజ్ భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్, పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లాలనుకునే వాహనాలను ఖైరతాబాద్ ఫ్లైఓవర్ పైకి అనుమతించరు. వాటిని నిరంకారీ, ఓల్డ్ పీఎస్ సైఫాబాద్, ఇక్బాల్ మీనార్ వైపు మళ్లిస్తారు.
♦ ట్యాంక్‌బండ్ అంబేడ్కర్ విగ్రహం నుంచి వచ్చే వాహనాలను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. వీటిని ఇక్బాల్ మీనార్ వైపు మళ్లిస్తారు. ఇక్బాల్ మీనార్ నుంచి సికింద్రాబాద్ వెళ్లే ట్రాఫిక్‌ను ట్యాంక్ బండ్ వైపు అనుమతించకుండా, తెలుగు తల్లి ఫ్లైఓవర్ ద్వారా కట్టమైసమ్మ టెంపుల్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ క్రాస్ రోడ్స్ వైపు మళ్లిస్తారు.
♦ మినిస్టర్ రోడ్ నుంచి పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను నల్లగుట్ట బ్రిడ్జ్ వద్ద కర్బలా వైపు మళ్లిస్తారు.
♦ బుద్ధ భవన్ నుంచి పీవీఎన్ఆర్ మార్గ్ వైపు వెళ్లే ట్రాఫిక్ ను నల్లగుట్ట క్రాస్ రోడ్స్ వద్ద మినిస్టర్ రోడ్ వైపు మళ్లిస్తారు.
♦ లిబర్టీ, ఖైరతాబాద్ వైపు వెళ్లాలనుకునే వారు.. కవాడిగూడ క్రాస్ రోడ్స్, డీబీఆర్ మిల్స్, స్విమ్మింగ్ పూల్, బండమైసమ్మ, ధర్నా చౌక్, ఇందిరా పార్క్ క్రాస్ రోడ్స్, ఆర్‌కే మఠం, కట్టమైసమ్మ జంక్షన్, అంబే డ్కర్ విగ్రహం లేదా తెలుగు తల్లి ఫ్లైఓవర్, ఇక్బాల్ మీనార్ మార్గాల్లో వెళ్లాలి.
♦ ట్యాంక్ బండ్ నుంచి పంజాగుట్ట వైపు వెళ్లాలనుకునేవారు రాణిగంజ్, మినిస్టర్ రోడ్, బేగంపేట, పంజాగుట్ట మార్గాన్ని వినియోగించాలి.
♦ అత్యవసర సహాయం కోసం ట్రాఫిక్ హెల్ప్ లైన్ నెంబర్ 9010203626ను సంప్రదించాలని పోలీసులు సూచించారు.