Cyclone Warning : ఉత్తరాంధ్రపై ఫోని పడగ

ఫోని తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మే 03వ తేదీ శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.

  • Publish Date - May 2, 2019 / 12:54 AM IST

ఫోని తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మే 03వ తేదీ శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది.

ఫోని తుఫాన్‌ ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలో మే 03వ తేదీ శుక్రవారం భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశముంది. శ్రీకాకుళం జిల్లాపై తుఫాన్‌ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. విశాఖ జిల్లాలోనూ ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో తుఫాన్‌ ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారులను నియమించారు. గజ ఈతగాళ్లను అందుబాటులో ఉండచంతోపాటు తీర ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు. ఎన్డీఆర్‌ఎఫ్‌, ఎస్టీఆర్‌ఎస్‌ సిబ్బందిని రెడీగా ఉంచారు.
Also Read : ఫోని తుఫాన్ ప్రభావం : 50కి పైగా రైళ్లు రద్దు

కోస్తాలో కొన్ని ప్రాంతాలు, రాయలసీమలో చెదురుమదురు నుంచి ఒక మోస్తారు వర్షాలు కురియనున్నాయి. సముద్రపు అలలు మీటరు నుంచి 2 మీటర్ల వరకు ఎగసిపడే అవకాశముంది. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రకాశం జిల్లాలో రాత్రి నుంచి భారీగా ఈదురుగాలులు వీస్తున్నాయి. తీర ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయి అంధకారం అలముకుంది. వాతావరణ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తమైన రైల్వేశాఖ తూర్పు కోస్తా రైల్వే పరిధిలో 74 రైళ్లను రద్దు చేసింది.  

తుఫాన్‌ కదలికలను ఆర్టీజీఎస్‌ నుంచి కూడా నిరంతరం గమనిస్తున్నారు. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు.తుఫాన్‌ సహాయ చర్యలపై కేంద్ర కేబినెట్‌ కార్యదర్శి ప్రదీప్‌కుమార్‌ సిన్హా ఏపీ, ఒడిశా, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల సీఎస్‌లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఏపీలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కొంత ప్రభావం ఉండి , తీవ్రమైన గాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశముండడంతో… ఆ ప్రాంతంలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

పూరిగుడిసెల్లో ఉండేవారికి తగిన పునరావాసం కల్పించాలన్నారు. మరోవైపు ఏపీ సీఎస్‌ ఎల్వీ సుబ్రమణ్యం కూడా ఉన్నతాధికారులతో, కోస్తా జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. శ్రీకాకుళంలో తుఫాన్‌ సహాయ చర్యలు చేపట్టేందుకు ముగ్గురు ఐఏఎస్‌ అధికారులను నియమించారు. కరెంటు సరఫరాకు అంతరాయం కలిగితే విద్యుత్‌ పునరుద్ధరణకు 500 విద్యుత్ స్తంభాలు, 2 జేసీబీలు, సిబ్బందిని అందుబాటులో ఉంచుతున్నారు. శ్రీకాకుళం జిల్లాలో 6వేల సోలార్‌ లాంతర్లు పంపిణీ చేస్తున్నారు.
Also Read : ఒడిశాలో ఫోనీ ఎఫెక్ట్ : నదులకు వరద ముప్పు

ట్రెండింగ్ వార్తలు