బంగాళాఖాతంలో అల్పపీడనం

  • Publish Date - January 20, 2019 / 01:50 AM IST

హైదరాబాద్ : బంగాళాఖాతంలో అల్పపీడన ద్రోణి ఏర్పడింది. ఆగ్నేయ ప్రాంతంలో అండమాన్ వద్ద ఈ ద్రోణి ఏర్పడినట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ రాష్ట్రంపై ఎలాంటి ప్రభావం ఉండబోదని తెలిపింది. ఇక వాతావరణ విషయానికి వస్తే…రాష్ట్రంలో పగటిపూట పొడి వాతావరణం…రాత్రి వేళ చలి తీవ్రత ఉంటుందని పేర్కొంది. జనవరి 20, జనవరి 21 తేదీల్లో పలు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని…చలి మరింత తీవ్రమయ్యే అవకాశాలున్నాయని హెచ్చరించింది. జనవరి 19వ తేదీ శనివారం ఆదిలాబాద్‌లో అత్యల్పంగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. 
 

ట్రెండింగ్ వార్తలు