Telangana Weather Report : తెలంగాణలో ఎండలు తీవ్రమవుతున్నాయి. ఉదయం 8 దాటకముందే సూర్యుడు సుర్రుమనిస్తున్నాడు. తెలంగాణలోని తూర్పు జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. రానున్న రోజుల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
ఇప్పటికే 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది వాతావరణ శాఖ. ములుగు, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈదురుగాలులు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే ఛాన్స్ ఉందని వెదర్ ఆఫీసర్స్ చెబుతున్నారు.
మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్ డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్ ని ఫాలో అవ్వండి.. Click Here
15వ తేదీన జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.
”గత నాలుగైదు రోజుల నుంచి చూసుకుంటే తెలంగాణలో భిన్న వాతావరణం ఉంది. పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉంటున్నాయి. సాయంత్రం పూట చల్లటి వాతావరణం ఉంటుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటం వల్ల భూమి ఉపరితలం వేడి వాతావరణంతో నిండుకుని, తర్వాత క్రమేపి క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి, తేమ శాతం అధికంగా ఉన్న చోట క్యుములో నింబస్ మేఘాలు ఏర్పడి అక్కడ చల్లటి వాతావరణం ఉండే అవకాశం ఉంది.
Also Read : SRH టీం బస చేసిన హోటల్లో అగ్నిప్రమాదం..
ద్రోణి, ఉపరితల ఆవర్తనాలు ఉన్న చోట్ల వాతావరణం చల్లబడుతోంది. రాగల నాలుగు రోజులు ఉత్తర తెలంగాణ అంతటా క్రమేపి ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఏప్రిల్ 8నే 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఉమ్మడి ఉత్తర తెలంగాణ అంతటా సుమారు 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఉత్తర తెలంగాణలో ఉమ్మడి జిల్లాలు ఆదిలాబాద్, కొమురం భీమ్, మంచిర్యాల, నిర్మల్ ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. భద్రాద్రి, కొత్తగూడెం ప్రాంతాల్లోనూ ఎండ తీవ్రత పెరిగే అవకాశం ఉంది.
Also Read : తెలంగాణ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం.. 7లక్షల మందికి మేలు జరిగేలా కొత్త పాలసీ..
మధ్యప్రదేశ్ నుంచి ద్రోణి కొనసాగుతోంది. తెలంగాణ సరిహద్దుల మీద పోవడం వల్ల ఉత్తర, తూర్పు తెలంగాణకు తేలికపాటి వర్ష సూచన ఉంది. జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్, హన్మకొండ, నాగర్ కర్నూల్ కు ఈదురుగాలుల ప్రభావం ఉంది. గంటకు 30 నుంచి 40 కిమీ వేగంతో గాలి వీచి తేలికపాటి వర్షానికి కారణమయ్యే అవకాశం ఉంది” అని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు తెలిపారు.