Telangana monsoon
Telangana : నైరుతి రుతుపవనాలు ఈరోజు మధ్య అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, ముంబైతో సహా, కొంకణ్ లోని చాలా ప్రాంతాలలో.. మధ్య మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు, కర్నాటకలోని మరికొన్ని ప్రాంతాలలోకి ప్రవేశించాయని హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాగల 48 గంటల్లో తెలంగాణా, ఆంధ్రప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య & వాయువ్య బంగాళాఖాతంలలో రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. రాగల 2,3 రోజులలో తెలంగాణాలోని మరికొన్ని భాగాలు, ఆంధ్రప్రదేశ్, బంగాళాఖాతం లోని చాలా ప్రాంతాలు… ఒడిశాలోని కొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా మారతాయని అధికారులు వివరించారు.
ఈ రోజు క్రింది స్థాయి గాలులు ముఖ్యంగా పశ్చిమ దిశ నుండి తెలంగాణా రాష్ట్రము వైపుకి వీస్తున్నాయి. ఈరోజు తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు కొన్నిచోట్ల కురిసే అవకాశం ఉందని…రేపు, ఎల్లుండి తెలంగాణా రాష్ట్రంలో తేలికపాటి నుండి మోస్తరు వర్షములు చాలా చోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
రాగల మూడు రోజులు తెలంగాణ రాష్ట్రంలో ఓమోస్తరు వర్షాలు కురిసే సమయంలో ఉరుములు,మెరుపులు… గంటకు 30నుండి 40 కిలోమీటర్లు వేగంతో గాలులు వీచే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట మరియు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలలో అక్కడక్కడ వడ గాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు.
Also Read : National Herald case: రేపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ మీడియా సమావేశాలు