National Herald case: రేపు దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ మీడియా సమావేశాలు
కాంగ్రెస్ పార్టీ రేపు దేశ వ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఈ పార్టీ శనివారం ఓ ప్రకటన చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపిన విషయం తెలిసిందే.

Sonia Rahul
National Herald case: కాంగ్రెస్ పార్టీ రేపు దేశ వ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించనుంది. ఈ మేరకు ఈ పార్టీ శనివారం ఓ ప్రకటన చేసింది. నేషనల్ హెరాల్డ్ వార్తా పత్రికకు సంబంధించిన నగదు అక్రమ చలామణీ కేసులో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఆమె కుమారుడు, ఎంపీ రాహుల్ గాంధీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే దేశ వ్యాప్తంగా మీడియా సమావేశాలు నిర్వహించి, ఆ కేసుపై పూర్తి వివరాలు చెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది.
Rajya Sabha Polls: సత్తా చాటిన బీజేపీ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?
రాహుల్ గాంధీ జూన్ 2న తమ ముందు విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపగా, విదేశాల్లో ఉన్న కారణంగా ఆయన హాజరుకాలేదన్న విషయం తెలిసిందే. దీంతో, ఈ నెల 13న విచారణకు రావాలని ఈడీ మరోసారి సమన్లు పంపింది. దీంతో ఆయన సోమవారం విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అలాగే, సోనియా గాంధీ జూన్ 8న విచారణకు హాజరుకావాలని ఈడీ సమన్లు పంపగా ఆమెకు కరోనా సోకడంతో హాజరుకాలేదు. దీంతో జూన్ 23న విచారణకు రావాలని ఈడీ మళ్లీ సమన్లు పంపింది. ఈ నేపథ్యంలోనే దేశ ప్రజలకు వివరాలు తెలపాలని కాంగ్రెస్ భావిస్తోంది.