Rajya Sabha Polls: స‌త్తా చాటిన‌ బీజేపీ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్ర‌క‌టించగా, వాటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావ‌డంతో నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన‌ 16 స్థానాలకు శుక్ర‌వారం ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే.

Rajya Sabha Polls: స‌త్తా చాటిన‌ బీజేపీ.. ఏ పార్టీకి ఎన్ని సీట్లు?

Bjp National Meet

Rajya Sabha Polls: రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. కేంద్ర ఎన్నిక‌ల సంఘం దేశంలోని 15 రాష్ట్రాల్లోని 57 స్థానాలకు ఎన్నికల షెడ్యూల్ ప్ర‌క‌టించగా, వాటిలో 41 స్థానాలు ఏకగ్రీవం కావ‌డంతో నాలుగు రాష్ట్రాల్లో మిగిలిన‌ 16 స్థానాలకు శుక్ర‌వారం ఎన్నిక‌లు జ‌రిగిన విష‌యం తెలిసిందే. మ‌హారాష్ట్ర‌, క‌ర్ణాట‌క‌, రాజ‌స్థాన్‌, హ‌రియాణా రాష్ట్రాల్లో ఈ ఎన్నిక‌లు జ‌రిగాయి. ఎనిమిది స్థానాల్లో బీజేపీ విజయం సాధించింది. ఐదు సీట్లు కాంగ్రెస్ గెలుపొంద‌గా, శివసేన, ఎన్‌సీపీకి ఒక్కో స్థానం ద‌క్కాయి. అలాగే, హరియాణాలో బీజేపీ మద్దతు ఉన్న స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు.

Rajya Sabha Polls: ఓటు వేసేందుకు బెయిల్ ఇవ్వలేమన్న హైకోర్టు.. న‌వాబ్ మాలిక్‌కు నిరాశ

మహారాష్ట్రలో మొత్తం ఆరు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అధికార మహావికాస్ అఘాడీకి అనుకున్నంత‌మేర సీట్లు ద‌క్క‌లేదు. ఆరు స్థానాల్లో మూడు స్థానాల్లో బీజేపీ గెలిచింది. మహారాష్ట్ర నుంచి ఆ పార్టీ తరఫున‌న రాజ్యసభకు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అనిల్ బోండే, ధనంజయ్ మహాదిక్ ఎన్నిక‌య్యారు. అలాగే, శివసేన నుంచి సంజయ్ రౌత్, ఎస్‌సీపీ నుంచి ప్రఫుల్ పటేల్ రాజ్య‌స‌భ‌కు వెళ్తున్నారు. కాంగ్రెస్ నుంచి ప్రతాప్ గర్హీ ఎన్నికయ్యారు.

Rajya Sabha Polls: మా పార్టీ నేత‌ల‌ను కొనేందుకు కాంగ్రెస్ బేర‌సారాలు: కుమార‌స్వామి

కర్ణాటకలో నాలుగు స్థానాలకుగానూ మూడు స్థానాల్లో బీజేపీ విజ‌య దుందుభి మోగించింది. ఒక స్థానంలో కాంగ్రెస్ గెలిచింది. కర్ణాటకలో బీజేపీ నుంచి రాజ్యసభకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నటుడు జగ్గేశ్, ఎమ్మెల్సీ లెహర్ సింగ్ సిరోయా ఎన్నిక‌య్యారు. కాంగ్రెస్‌ నుంచి రాజ్యసభకు కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్ ఎన్నిక‌య్యారు.

prophet row: రాంచీలో హింస‌.. ఇద్ద‌రి మృతి.. ముగ్గురి ప‌రిస్థితి విష‌మం

ఇక‌, రాజస్థాన్‌లోని నాలుగు రాజ్యసభ స్థానాల్లో మూడు స్థానాల్లో కాంగ్రెస్ గెలిచింది. బీజేపీ ఒక్క స్థానం గెలుచుకుంది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ నుంచి రాజ్యసభకు రణ్‌దీప్ సుర్జేవాలా, ముకుల్ వాస్నిక్, ప్రమోద్ తివారీ ఎన్నిక‌య్యారు. రాజస్థాన్‌లో బీజేపీ నుంచి పోటీ చేసిన ఘన్‌శ్యామ్ తివారీ గెలుపొందారు.

Bengaluru: మ‌హిళ‌పై యాసిడ్ దాడి చేసిన తోటి ఉద్యోగి

హరియాణా నుంచి రెండు రాజ్యసభ స్థానాలను బీజేపీ గెలుచుకుంది. హరియాణా నుంచి బీజేపీ రాజ్యసభ స‌భ్యులుగా కృష్ణ‌న్‌ లాల్ పన్వార్, బీజేపీ మద్దతున్న స్వతంత్ర అభ్యర్థి కార్తికేయ శర్మ ఎన్నిక‌య్యారు.