Heavy rains in Telangana (1)
Rain alert for Telangana: తెలంగాణలో మరో మూడు రోజులు పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. గత రెండు రోజులుగా హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తోన్న విషయం తెలిసిందే. పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం నిన్న వాయవ్య, దాని పరిసర పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగిందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అది సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉందని చెప్పింది. అంతేగాక, మరో ఉపరితల ఆవర్తనం తూర్పు, మధ్య బంగాళాఖాతంలో వచ్చే శనివారం ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది. తెలంగాణలోని పలు ప్రాంతాల్లో మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాగా, నిన్న సాయంత్రం హైదరాబాద్ లో భారీ వర్షం కురవడంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికీ రోడ్లపై నీళ్లు నిలిచే ఉన్నాయి. నిన్న మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, శేరిలింగంపల్లి, కూకట్ పల్లి, గోషామహల్, కోఠి, బషీరాబాద్, నారాయణగూడ, ఎల్బీనగర్ నాగోల్, ఉప్పల్ తో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది.
White Clad Ghost : అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం..! హడలిపోతున్న జనం.. వీడియో వైరల్…