White Clad Ghost : అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం..! హడలిపోతున్న జనం.. వీడియో వైరల్…

అదో వింత ఆకారం. అర్థరాత్రి మాత్రమే వస్తుంది. భవనాలపై తిరుగుతుంది. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆ వింత ఆకారం వారణాసి ప్రజలను వణికిస్తోంది. కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.

White Clad Ghost : అర్ధరాత్రి ఇళ్లపై తిరుగుతున్న దెయ్యం..! హడలిపోతున్న జనం.. వీడియో వైరల్…

White Clad Ghost : అదో వింత ఆకారం. అర్థరాత్రి మాత్రమే వస్తుంది. భవనాలపై తిరుగుతుంది. తెల్లటి దుస్తుల్లో ఉన్న ఆ వింత ఆకారం వారణాసి ప్రజలను వణికిస్తోంది. కంటి మీద కనుకు లేకుండా చేస్తోంది.

వారణాసిలోని భేల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బడి గబీలోని వారణాసి డెవలప్‌మెంట్ అథారిటీ కాలనీలో ప్రజలు కొన్ని రోజులుగా నిద్ర లేని రాత్రులు గడుపుతున్నారు. దీనికి కారణం దెయ్యం లాంటి ఒక ఆకారం తిరుగుతుండటమే అంటున్నారు. తెల్లటి దుస్తులు ధరించిన ఒక భయానక ఆకారం ఇంటి పైకప్పుపై తిరుగుతోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇది కచ్చితంగా దెయ్యమేనని కొందరు అంటుంటే.. కాదు కాదు.. ఎవరో ఆకతాయి చేసిన పని అని మరికొందరు అంటున్నారు. వింత ఆకారం గురించి ప్రజలు భయాందోళన చెందుతుండటంతో స్థానిక పోలీసులు ఈ విషయం ఏంటో తేల్చేందుకు రంగంలోకి దిగారు. కాలనీవాసులను భయభ్రాంతులకు గురి చేస్తున్న వారెవరో త్వరలోనే తెలుసుకుని వారికి తగిన శిక్ష వేయాలని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో భాగంగా ఇప్పటికే భేలుపూర్ పోలీసులు దుండగులపై కేసు నమోదు చేశారు.

కాగా.. వైరల్ అవుతున్న వీడియోలో వారణాసిలోని ఒక భవంతిపై తెల్లటి దుస్తులు ధరించి ఒక దెయ్యం లాంటి ఆకారం నడుస్తుండటం చూడవచ్చు. ఈ ఆకారం చూస్తుంటే ఇది నిజంగానే దెయ్యమేనని అనిపిస్తోంది. ఒక వ్యక్తి దీనిని వీడియో తీసి వాట్సాప్ లో వైరల్ చేశాడు. దాంతో కాలనీ వాసులందరూ బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

దీనిపై కొందరు వ్యక్తులు పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసుకున్న భేలుపూర్ పోలీసుల.. దర్యాప్తు మొదలు పెట్టారు.