AP Rain Alert: ఏపీకి వర్ష సూచన.. రెండు రోజులు వానలు..! ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు..!
మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.
- Naveen
- Published On : February 20, 2026 / 06:31 PM IST
Rains Representative Image (Image Credit To Original Source)
- బంగాళాఖాతంలో అల్పపీడనం
- రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం
- ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే ఛాన్స్
AP Rain Alert: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వర్ష సూచన చేసింది రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వానలు కురుస్తాయని అంచనా వేసింది. ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడే అవకాశం ఉందని తెలిపింది.
హిందూ మహా సముద్రం దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంపై విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాబోయే 48 గంటల్లో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. పశ్చిమ-వాయువ్య దిశగా కదిలే అవకాశం ఉందంది. దీని ప్రభావంతో రేపు, ఎల్లుండి.. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది.
మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల పిడుగులతో కూడిన తేలికపాటి వానలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు ప్రజలు అప్రమ్తతంగా ఉండాలని అధికారులు జాగ్రత్తలు చెప్పారు. చెట్ల కింద ఉండరాదని సూచించారు. సురక్షితమైన ప్రదేశాల్లో తలదాచుకోవాలన్నారు.
Also Read: రాజీనామా చేసిన వైసీపీ ఎమ్మెల్సీలకు మండలి చైర్మన్ నోటీసులు
