AP Heatwaves: నిప్పుల గుండంలా ఏపీ.. అక్కడ అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు.. సోమవారం వరకు..
రాష్ట్రంలో సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేశారు అధికారులు.
AP Heatwaves: ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రం నిప్పుల గుండంలా మారింది. రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాష్ట్రంలోనే అత్యధికంగా పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో 48.1°C టెంపరేచర్ నమోదైంది. ఇక, బాపట్ల జిల్లా వేటపాలెంలో 47.6°C, కృష్ణా జిల్లా నందివాడలో 47.6°C, ఎన్టీఆర్ జిల్లా తొర్రగుడిపాడులో 47.4°C, ప్రకాశం జిల్లా అద్దంకిలో 47.4°C, ఏలూరు జిల్లా అల్లిపల్లిలో 47.3°C, మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 46.6°C, పోలవరం జిల్లా కూనవరంలో 46.5°C, నెల్లూరు జిల్లా కావలిలో 46.4°C, గుంటూరు జిల్లా తెనాలిలో 46°C ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యాయి.
రాష్ట్రంలో సోమవారం వరకు ఎండ తీవ్రత కొనసాగుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఎండలు మండిపోతున్న నేపథ్యంలో ప్రజలకు కీలక సూచన చేశారు అధికారులు. ఇంటి నుంచి బయటకు రావొద్దన్నారు. ఎండలో తిరగొద్దని చెప్పారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావొద్దని సూచించారు. తరచూ నీరు తాగాలని.. వృద్ధులు, చిన్నారులు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడ దెబ్బ లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలన్నారు.
Also Read: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం.. ఆ గ్రామాల్లో కొత్త సర్వే.. ఎందుకంటే?
