Rains In Telangana : తెలంగాణలో మరో నాలుగు రోజులు వర్షాలు

తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 3.1 కిలో మీటర్లు ఎత్తున గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదారాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు.

Rains In Telangana :  తూర్పు, పశ్చిమ భారత ప్రాంతాల మధ్య 3.1 కిలో మీటర్లు ఎత్తున గాలుల్లో అస్థిరత కారణంగా ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని హైదారాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. మరోవైపు ఒడిశాపై అల్పపీడనం ఏర్పడింది. దీనికి అనుబంధంగా 7.6 కిలో మీటర్లు ఎత్తువరకు మరో ఉపరితల ఆవర్తనం ఉంది.. వీటి వల్ల తెలంగాణలో రుతుపవనాల గాలులు తక్కువ ఎత్తులోకి వచ్చాయిని…. వీటి ప్రభావంతో కుంభవృష్టి కురుస్తున్నట్లు అధికారులు వివరించారు.

సోమ, మంగళవారాల్లో వీటి ప్రభావం ఎక్కువ గా ఉంటుందని.. మరో 2,3 రోజుల్లో బంగాళా ఖాతంలో మళ్లీ ఉపరి తల ఆవర్తనం లేదా అల్ప పీడనం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయని అధికారులు తెలిపారు. మళ్లీ అల్పపీడనం ఏర్పడితే ప్రస్తుతం కురుస్తున్న భారీ  వర్షాలు కొనసాగుతాయని వివరించారు. ఒకటి రెండు రోజుల్లో ఈ విషయంపై మరింత స్పష్టత వస్తుందని అధికారులు చెప్పారు.

మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాల వల్ల నిర్మల్ జిల్లా సారంగాపూర్‌ మండలం స్వర్ణ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు చేరుతుంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1183 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 1182 అడుగులు చేరుకొని ఇంకా నీరు రావడంతో అధికారులు ఒక గేటు ద్వారా 3700 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు.
Also Read :Shimla Building : భారీవర్షాల దెబ్బకు.. చూస్తుండగానే కుప్పకూలిన భారీ భవనం.. వీడియో!

జగిత్యాల పట్టణంలోని సాయి నగర్ లో మొన్నటి నుంచి నుంచి కురుస్తున్న వర్షం లో నిన్న మధ్యాహ్నం చేపల వర్షం పడింది దీంతో స్థానికులు ఆశ్చర్యానికి గురై చేపల వర్షంలో కిందపడిన చేపలను తీసుకెళ్లారు.

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. కుండపోతగా కురిసిన వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు జలమయం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు వరద  నీటితో నిండిపోయాయి. శివారు కాలనీలు నీట మునిగాయి. వేల్పూర్-భీంగల్-సిరికొండ-మోర్తాడ్-దర్పల్లి మండలాల్లో పెద్ద వాగు, మొండి వాగు, రాళ్ళ వాగు, కప్పల వాగులకు వరద ఉధృతి పెరిగింది. పలుచోట్ల లోలెవల్ వంతెనలు నీట మునిగాయి.

వరద నీటి ప్రవాహం తో కొన్ని చోట్ల తాత్కాలిక వంతెనలు  తెగిపోయి రాకపోకలు  నిలిచిపోయాయి.  బీర్కూర్ నవిపెట్ ఎడపల్లి మండలాల్లో  చెరువులు కుంటలకు గండ్లు పడి వరి పంటలు నీట మునిగాయి. భారీ వర్ష సూచనతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్త మైంది. వరద సహాయ చర్యల కోసం కలెక్టరేట్ లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు.   మున్సిపల్ కార్పోరేషన్ అధికారులు సైతం జోన్ల వారిగా సహాయక
కేంద్రాలు ఏర్పాటు చేశారు. వరద పరిస్ధితులపై మంత్రి ప్రశాంత్ రెడ్డి అధికారుతో సమీక్షించారు.

 

ట్రెండింగ్ వార్తలు