చలి..చలి

  • Publish Date - January 21, 2019 / 01:03 AM IST

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో మరలా చలి పెరుగుతోంది. ఆదివారం పలు జిల్లాలో స్వల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పగలు సాధారణంగానే ఉష్ణోగ్రతలున్నా..రాత్రి వేళ చలి గాలులు వీస్తున్నాయి. దీనితో సాయంత్రం నుండే ఇంటి నుండి బయటకు రావడానికి జనాలు వెనకడుగు వేస్తున్నారు. గాలిలో తేమ బాగా పెరిగిందని వాతావరణ శాఖ పేర్కొంటోంది. రాత్రి వేళ సాధారణంకన్నా 4 డిగ్రీలు తక్కువుగా ఉంటే…పగటి వేళ 3 డిగ్రీలు అదనంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జనవరి 20వ తేదీ ఆదివారం హైదరాబాద్, హన్మకొండ జిల్లాల్లో 13 డిగ్రీలుండగా ఆదిలాబాద్‌లో 9, రామగుండం, మెదక్ జిల్లాలలో 12 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.