వేసవిలో ఎండలు విజృంభిస్తున్నాయి. భానుడు మార్చిలోనే తడఖా చూపిస్తున్నాడు. సూర్యుడి దెబ్బకు జనాలు అల్లాడుతున్నారు. రెండు రోజులుగా తీవ్రమైన ఎండలు తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. మధ్యాహ్న సమయాల్లో ప్రజలు బయట తిరగడం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. గరిష్ట ఉష్ణోగ్రతలు తెలంగాణాలో 42 డిగ్రీల వరకు, ఏపీలో 40 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి.
మధ్యాహ్న సమయంలో జనజీవనం స్తంభిస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. అప్పుడే. రాత్రివేళ్లల్లోనూ ఉక్కపోత తీవ్రమౌతోంది. ఈ మండుటెండల తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరిస్తుండడంతో తెలుగు రాష్ట్రాల ప్రజల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. ఏప్రిల్, మే నెలలో ఎండలు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు.
Read Also : ఎండలు బాబోయ్ ఎండలు : పెరగనున్న ఉష్ణోగ్రతలు
పెరుగుతున్న ఎండలు అన్ని వర్గాలపై ప్రభావం చూపిస్తోంది. నిర్మాణ రంగ కార్మికులు, చిరు వ్యాపారుల ఉపాధిపై తీరని దెబ్బ తగులుతోంది. అక్కడక్కడ వడదెబ్బ కేసులు కూడా నమోదవుతున్నాయి. గత రెండు రోజులుగా ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే, గడిచిన రెండేళ్ల రికార్డును బద్దలుకొట్టాయి. పెరుగుతున్న ఎండలు..గాలిలో గణనీయంగా తగ్గిపోతున్న తేమశాతంపై వాతావరణ శాస్త్రవేత్తలు సైతం స్పష్టమైన కారణాలు చెప్పలేకపోతున్నారు.
ఉష్ణోగ్రతలు :-
ప్రాంతం | గరిష్ట | కనిష్ట |
నిజామాబాద్ | 42.5 | 29.5 |
రామగుండం | 42.2 | 30.0 |
నల్గొండ | 42.0 | 28.4 |
ఆదిలాబాద్ | 42.0 | 28.0 |
హైదరాబాద్ | 41.2 | 29.0 |
భద్రాచలం | 41.0 | 27.5 |
మహబూబ్ నగర్ | 40.5 | 27.0 |
హన్మకొండ | 40.0 | 27.0 |
మెదక్ | 40.0 | 27.0 |