×
Ad

Weather Updates: ఏపీకి వాయు’గండం’.. ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. అక్టోబర్ 1న మరో అల్పపీడనం..!

కృష్ణా, గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరించింది.

Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం బలపడుతోంది. మరికొన్ని గంటల్లో అది వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. ఈరోజు సాయంత్రం నుంచి రేపు ఉదయం లోపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటివరకు శ్రీకాకుళం ఆమదాలవలసలో 54 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

శ్రీకాకుళంలో 48.7 మిల్లీమీటర్లు, ప్రకాశం జిల్లా పెద్దరావీడులో 42 మిల్లీమీటర్లు, విజయనగరం జిల్లా నెల్లిమర్లలో 41 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎగువ వర్షాలతో రానున్న మూడు రోజుల్లో కృష్ణా, గోదావరికి వరద పెరిగే అవకాశం ఉందని APSDMA అంచనా వేసింది.

తీరం వెంబడి 50కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఇదిలా ఉంటే అక్టోబర్ 1న మరో అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే సూచనలు కనపడుతున్నాయంది.

Also Read: ఏపీలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఖాతాల్లో రూ.15వేలు పడేది ఆ రోజే.. అర్హుల లెక్క తేలింది.. ఎంతమంది అంటే..

* బంగాళాఖాతంలో బలపడుతున్న తీవ్ర అల్పపీడనం.
* మరికొన్ని గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం.
* వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు.
* కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.
* శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, విశాఖ, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, ప్రకాశం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్.
* తీరం వెంబడి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు.