Weather Updates: ఏపీలో వర్షాలు కంటిన్యూ అవుతున్నాయి. పలు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. తాజాగా పిడుగు లాంటి వార్త చెప్పింది విపత్తుల నిర్వహణ శాఖ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న 3 గంటల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరించింది.
విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కోనసీమ, గుంటూరు, పల్నాడు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద నిలబడొద్దని వారించారు.
కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు వానలకు అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈదురు గాలులు సైతం వీచే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
వర్షం సమయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. చెట్ల కింద ఉండటం సురక్షితం కాదన్నారు. వర్షం సమయంలో సురక్షిత ప్రాంతాల్లో తలదాచుకోవాలని అధికారులు జాగ్రత్తలు చెప్పారు.
Also Read: విశాఖలో విషాదం.. బీచ్‌లో కొట్టుకుపోయిన ఇద్దరు విదేశీయులు.. ఒకరు మృతి