Bigboss-4 Telugu : సోహెల్ x అభిజిత్ మధ్య వాగ్వాదం..గంగవ్వ ఫుల్ జోష్

  • Published By: madhu ,Published On : September 10, 2020 / 07:08 AM IST
Bigboss-4 Telugu : సోహెల్ x అభిజిత్ మధ్య వాగ్వాదం..గంగవ్వ ఫుల్ జోష్

బుల్లితెరపై ప్రసారం అవుతున్న Bigboss-4 Telugu రియాల్టీ షో…రోజులు గడుస్తున్న కొద్ది కంటెస్టెంట్ల రూపాలు ఒక్కొటిగా బయటపడుతున్నాయి. అభిజిత్, సోహెల్ మధ్య వాగ్వాదం, కంటెస్టెంట్ల మధ్య అరియాన చిచ్చు పెట్టడం, ఏడుపులు, హాట్ హాట్ గా షో కొనసాగుతోంది.



గంగవ్వ మాత్రం అదరగొడుతోంది. తనదైన శైలిలో మాట్లాడుతూ..హవభావాలు చేస్తున్న గంగవ్వకు ఓట్లు ఎక్కువగానే వేస్తుండడం విశేషం. ఎవరైనా తినిపిస్తే తింటానని అరియాన మారం చేయడం, అఖిల్ ఆమెకు అన్నం ముద్దలు పెట్టాడు. ఇది చూసిన ఇతర కంటెస్టెంట్లు చీదరించుకున్నారు. తనకెవరూ తినిపించలేదని, ఆమె అడగ్గానే తినిపించానంటూ..ఏడ్చేశాడు. అరియానాకు కళ్యాణి కూడా తినిపించింది.



ఈమె కూడా వెక్కి వెక్కి ఏడ్చింది. అయితే..ఇక్కడ విషయం ఏమిటంటే..అఖిల్ ఏడుస్తుంటే..అరియాన పట్టించకపోవడం హైలెట్. అరియాన ప్రవర్తనను చూసి అందరూ షాక్ తింటున్నారు. అసలు తినిపించాలని ఎందుకు అడుగుతున్నావ్ అన సోహైల్ అనడం, నా ఇష్టం అంటూ..అరియాన కౌంటర్ ఇవ్వడం జరిగిపోయాయి.
https://10tv.in/donald-trump-is-nominated-for-the-2021-nobel-peace-prize-following-deal-between-israel-and-the-united-arab-emirates/


ఇక ఈ రియాల్టీ షోలో గంగవ్వ హైలెట్ గా నిలుస్తోంది. పిచ్చ ఫ్యాన్స్ ఉండడంతో ఆమెకు అందరికన్నా ఎక్కువ ఓట్లు పడుతుండడం గమనార్హం. డంబెల్స్ ఎత్తుకుని ఎక్సర్ సైజ్ చేయడం, బిగ్ బాస్ అంటూ కెమెరాకు ముద్దులు పెట్టడం అందర్నీ ఆకట్టుకుంది. హరిక ఈమెతో ముచ్చట్లు పెట్టింది.



ఈమెకు ఫ్లయింగ్ కిస్ ఇవ్వడంతో ఇతర కంటెస్టెంట్లు ఆశ్చర్యపోయారు. చీరకు మ్యాచింగ్ అవుతది..లిప్ స్టిక్ పెట్టుకో అని అరియాన, గంగవ్వకు సూచిస్తుంది. ఒక్కసారిగా గంగవ్వ కేకలేసింది. నాకేం వద్దు..ఎందుకరుస్తున్నావ్ అంటూ..గట్టిగా మాట్లాడింది. అరియాన ఎంట్రీతో గొడవలు, ఏడుపులు షురూ అయ్యాయని ప్రేక్షకులు అంటున్నారు.