Brazil Beauty Pageant : అందాల పోటీల్లో తన భార్యకి అన్యాయం జరిగిందంటూ విజేత కిరీటాన్ని నేలకేసి కొట్టిన వ్యక్తి
అందాల పోటీల్లో ఓ వ్యక్తి స్టేజీమీదకు దూసుకొచ్చి రచ్చరచ్చ చేశాడు. విజేతకు అలంకరించే కిరీటాన్ని నేలకేసి కొట్టాడు.

Brazil Beauty Pageant
Beauty Pageant : బ్రెజిల్ (Brazil)లో జరిగిన అందాల పోటీ(Beauty Pageant )ల్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ వ్యక్తి విజేతలు అలంకరించే కిరీటాన్ని నేలకేసి కొట్టాడు. స్టేజీమీద నానా రచ్చా చేశాడు. కిరీటాన్ని రెండుసార్లు నేలకేసి కొట్టాడు. అక్కడున్నవారు అడ్డుకున్నా ఆగలేదు..పెద్ద పెద్దగా అరిచాడు.తరువాత తన భార్యను అక్కడనుంచి లాక్కెళ్లిపోయాడు. అనూహ్యంగా జరిగిన ఈ ఘటనకు స్టేజీమీద ఉన్న సుందరాంగులంతా బిత్తరపోయారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
బ్రెజిల్ లో మిస్ గే మాటో గ్రాసో 2023 (Miss Gay Mato Grosso 2023) అందాల పోటీలు శనివారం (మే28,2023) జరిగాయి. పలువురు మహిళలు ఈ పోటీల్లో పాల్గొన్నారు. అన్ని ప్రక్రియల్లోను విజయం సాధించి నథాలీ బెకర్ (Nathally Becker), ఇమ్మాన్యుయెల్ బెలీని (Emannuelly Belini) అనే ఇద్దరు సుందరాంగులు ఫైనల్‌కు చేరుకున్నారు. వీరిల్లో ఎవరు విజేతలు అవుతారనే ఉత్కంఠ నెలకొంది. ఫైనల్ కు చేరుకున్నవారిద్దిరు కూడా గుండెలు చిక్కబట్టుకుని నిలబడ్డారు. విజేతలుగా ఎవరు నిలుస్తారోనని..ఎంతో ఉత్కంఠగా ఆ ఇద్దరితో పాటు అందరు ఎదురు చూస్తున్నారు.
ఈ ఉత్కంఠకు ఫుల్ స్టాప్ పెడుతు బెలీని అందాల పోటీల్లో విజేతగా గా ప్రకటించారు నిర్వాహకులు. దీంతో ఆమెకు ధరింపజేయటానికి కిరీటాన్ని తీసుకొచ్చారు. అందరకీ ప్రదర్శించారు. విజేతకు కిరీటాన్ని ధరింపజేస్తుండగా అనూహ్య పరిణామం చోటుచేసుకంది. రెండో స్థానంలో నిలిచిన నథాలీ బేకర్ భర్త హఠాత్తుగా స్టేజీమీదకు దూసుకొచ్చారు. రావటం రావటంతోనే విజేతకు అలంకరించే కిరీటాన్ని దురుసుగా లాక్కుని నేలకేసి కొట్టాడు. అంతే అందరు షాక్ అయి ఏం జరుగుతుందో ఏంటో అనే అయోమయానికి గురి అయ్యారు.
ఇంతలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి తేరుకుని అతడిని వారించటానికి యత్నించాడు అయినా అతను ఆగలేదు. తన భార్యకు అన్యాయం జరిగిందంటూ విజేతకు పెట్టబోయిన కిరీటాన్ని లాక్కుని రెండు సార్లు నేలకేసి కొట్టాడు. అక్కడున్నవారిపై అరుస్తూ.. తన భార్యను పక్కకు లాక్కెళ్లాడు. అంతే అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న వాతావరణం అంతా ఉద్రిక్తతగా మారిపోయింది. స్టేజీమీద ఉన్న సుందరీమణులతో పాటు వీక్షకులు, నిర్వాహకులు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
Revolta na final do concurso Miss Brasil Gay 2023. Torcedor arranca coroa da vencedora e joga no chão durante a cerimônia de premiação. pic.twitter.com/rb6duFvAEn
— Bruno Guzzo® (@brunoguzzo) May 28, 2023
ఇంతలో సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకుని అతన్ని పక్కకు తీసుకెళ్లారు. కొద్ది నిమిషాల తరువాత విజేతకు కిరీటాన్ని అలంకరించారు. ఈ తతంగాన్నంతా అక్కడే ఉన్న వారు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో అదికాస్తా వైరల్‌గా మారింది. తన భార్యకు అన్యాయం జరిగిందని అతను అలా ప్రవర్తించాడని నిర్వాహకులు తెలిపారు. అది అతని అభిప్రాయమని న్యాయ నిర్ణేతలు సరైన నిర్ణయమే తీసుకున్నారని తెలిపారు.
Zerodha Nikhil Kamath : స్నేహానికి కూడా మాంద్యం వచ్చేసింది : జెరోదా కామత్