లిస్ట్ రెడీ : సచివాలయ ఉద్యోగాల అభ్యర్థులకు అప్ డేట్

ఏపీ గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అప్ డేట్. సచివాలయ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ రెడీ అయ్యింది. జిల్లాల వారీగా ఆన్ లైన్ లో మెరిట్ లిస్ట్ సిద్ధం చేశారు.

  • Published By: veegamteam ,Published On : September 23, 2019 / 10:16 AM IST
లిస్ట్ రెడీ : సచివాలయ ఉద్యోగాల అభ్యర్థులకు అప్ డేట్

ఏపీ గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అప్ డేట్. సచివాలయ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ రెడీ అయ్యింది. జిల్లాల వారీగా ఆన్ లైన్ లో మెరిట్ లిస్ట్ సిద్ధం చేశారు.

ఏపీ గ్రామ, వార్డు సచివాయ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు అప్ డేట్. సచివాలయ అభ్యర్థుల మెరిట్ లిస్ట్ రెడీ అయ్యింది. జిల్లాల వారీగా ఆన్ లైన్ లో మెరిట్ లిస్ట్ సిద్ధం చేశారు. రోస్టర్ పాయింట్లు, రిజర్వేషన్లు ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఆన్ లైన్ లో కాల్ లెటర్లు డౌన్ లోడ్ చేసుకోవాలని అధికారులు సూచించారు. మంగళవారం(సెప్టెంబర్ 24,2019) నుంచి జిల్లాల్లో అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన జరుగుతుంది. ఈ వివరాలను ఏపీ పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గిరిజా శంకర్ తెలిపారు. సెప్టెంబర్ 27 నుంచి అభ్యర్థులకు అపాయింట్ మెంట్ ఆర్డర్లు ఇస్తామన్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగ నియామకాలకు సంబంధించి అధికారులు ప్రక్రియను ముమ్మరం చేశారు. ఎలాంటి పొరపాట్లకు తావులేని రీతిలో మెరిట్‌ జాబితా తయారు చేశారు.