బాలింతకు రక్తస్రావం..శిశువులకు పాలు పట్టగానే ఆగిపోయిన అద్భుతం..తల్లిపాల మహత్యాన్ని నిరూపించిన నర్సు..

  • Published By: nagamani ,Published On : July 22, 2020 / 04:40 PM IST
బాలింతకు రక్తస్రావం..శిశువులకు పాలు పట్టగానే ఆగిపోయిన అద్భుతం..తల్లిపాల మహత్యాన్ని నిరూపించిన నర్సు..

ఔరంగాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో ఓ నర్సు సమయస్ఫూర్తి ఓ బాలింత ప్రాణాలు కాపాడింది. తల్లి పాలలోని ఔషధ గుణాల గురించి..వాటిలో ఉండే పోషకాల గురించి నిపుణులు చెబుతున్న సూచనలకు నిలువెత్తు నిదర్శనంగా కనిపించింది ఔరంగాబాద్ లోని ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగిన ఈ ఘటన. అద్భుతం..అత్యద్భుతం అనేలా జులై 17న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తల్లిపాలు శిశుల ఆరోగ్యాన్ని కాపాడటమే కాదు ప్రమాదంలో పడిని బాలింతను కూడా రక్షించవచ్చనే అద్భుత ఘటన జరిగింది.

జల్నాకు చెందిన ఓ 22 ఏళ్ల మహిళ ప్రసవం కోసం ఔరంగాబాద్‌ ప్రభుత్వాసుపత్రిలో చేరింది. ఆమెకు సిజేరియన్‌ ద్వారా కవలలకు జన్మనిచ్చింది. అప్పటి వరకూ అంతా బాగానే జరిగింది. ఆపరేషన్ జరిగిన కొంతసేపటికి బాలింతకు రక్తస్రావం మొదలైంది. దానికి డాక్టర్లు ఎంతగా ప్రయత్నించినా ఆగలేదు. రక్తస్రావం తీవ్రమైంది. బాలింత ప్రాణాలు పోయే పరిస్థితి ఏర్పడింది.

ఏం చేయాలో డాక్టర్లకు పాలుపోలేదు. ఎన్నో రకాలుగా ప్రయత్నించారు.కానీ రక్తస్రావం ఆగలేదు.చివరకు ఆమె గర్భసంచి తొలగించాలని నిర్ణయించారు. కానీ ఇంతో అక్కడే ఉన్న సీనియర్‌ నర్సు నైనేశ్వరీ ఘోడ్కేకు ఓ అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాన్ని డాక్టర్లు చెప్పింది. కానీ ఇది ఎంత వరకూ సాధ్యమవుతుందని ఆలోచించారు. కానీ ప్రయత్నించి చూద్దామనుకున్నారు. అంతగా కాకపోతే అప్పుడే గర్భసంచీ తీసేద్దామని అనుకున్నారు.

వెంటనే ఆ బాలింత పిల్లలను చేతుల్లోకి తీసుకున్న నర్సు నైనేశ్వరీ ఘోడ్కే తల్లి పాలు పట్టించింది. అంతే…!!ఆశ్చర్యకరంగా గంట లోపలే ఆమెకు రక్తస్రావం ఆగిపోయింది. తల్లి పాలిచ్చేటప్పుడు ఆమె రక్తంలో ఆక్సీటోనిక్‌ హార్మోన్లు విడుదలవుతాయి. ఇవి రక్తస్రావాన్ని అడ్డుకుంటాయి. నర్సుగా 11 ఏళ్ల అనుభవం ఉన్న నైనేశ్వరీ ఘోడ్కే.. ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు చెప్పిన ఈ విషయాలను గుర్తుతెచ్చుకుంది. అది ఆ బాలింత ప్రాణాలను కాపాడింది. దీంతో నర్స్ నైనేశ్వరి సమయస్పూర్తికి సీనియర్ డాక్టర్లంతా అభినందించారు. నర్స్ వృత్తికి సరైన నిర్వచన చెప్పావంటూ ప్రశంసించారు.

దీనిపై హాస్పిటల్ (జిఎంసిహెచ్) సీనియర్ అధికారి డాక్టర్ శ్రీనివాస్ గడప్ప మాట్లాడుతూ నర్సు జ్ఞానేశ్వరి ఘోడ్కే సమయస్ఫూర్తి మహిళ రక్తస్రావం ఆపడానికి సహాయపడందని ఇది చాలా మంచి ఆలోచన అని ప్రశ్నించారు.