సీఎం జగన్ మరో వరం : హోంగార్డుకు రూ.30 లక్షలు, కానిస్టేబుల్‌కు రూ.40 లక్షల ఇన్సూరెన్స్

హోంగార్డులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. హోంగార్డుల జీతాలు పెంచారు. రూ.18వేల నుంచి రూ.21వేలకు హైక్ చేశారు. అంతేకాదు ఎవరైనా హోంగార్డు విధి నిర్వహణలో

  • Published By: veegamteam ,Published On : October 21, 2019 / 10:23 AM IST
సీఎం జగన్ మరో వరం : హోంగార్డుకు రూ.30 లక్షలు, కానిస్టేబుల్‌కు రూ.40 లక్షల ఇన్సూరెన్స్

హోంగార్డులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. హోంగార్డుల జీతాలు పెంచారు. రూ.18వేల నుంచి రూ.21వేలకు హైక్ చేశారు. అంతేకాదు ఎవరైనా హోంగార్డు విధి నిర్వహణలో

హోంగార్డులకు సీఎం జగన్ గుడ్ న్యూస్ వినిపించారు. హోంగార్డుల జీతాలు పెంచారు. రూ.18వేల నుంచి రూ.21వేలకు హైక్ చేశారు. అంతేకాదు ఎవరైనా హోంగార్డు విధి నిర్వహణలో చనిపోతే… వారి కుటుంబానికి రూ.5లక్షల నష్టపరిహారం కూడా అందిస్తామన్నారు. హోంగార్డులకు రూ.30 లక్షల ఇన్సూరెన్స్ కవరేజ్ ప్రకటించారు. పోలీస్ సిబ్బందికి బీమా సౌకర్యం రూ.40లక్షల వరకు కల్పిస్తున్నట్లు తెలిపారు. రిటైర్డ్ పోలీసులకు కూడా బీమా వర్తిస్తుందన్నారు.

రాత్రి పగలు తేడా లేకుండా విధులు నిర్వహించే పోలీసులు.. బాధ్యతల నిర్వహణలో ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతుంటారని.. అటువంటి వారి త్యాగాలను ఎప్పటికీ గుర్తుంచుకుంటామని చెప్పారు. పోలీసులు ఒక్కరోజైనా వారి కుటుంబాలతో సంతోషంగా గడిపేందుకే వారికి కూడా వీక్లీ ఆఫ్‌లు ఇచ్చామన్నారు. అక్టోబర్ 21 అమరవీరుల సంస్మరణ దినం. విజయవాడ మున్సిపల్‌ స్టేడియంలో జరిగిన సంస్మరణ కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొన్నారు. అమర వీరులకు ఘనంగా నివాళి అర్పించారు. పోలీసుల గౌరవ వందనం సీఎం స్వీకరించారు. మహిళల భద్రత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని పోలీసులకు సూచించారు.

తప్పు చేసిన వారు ఎవరైనా చట్టం ముందు నిలబెట్టాల్సిందిగా ఎస్పీలతో జరిగిన తొలి సమావేశంలో తాను ఆదేశించానని సీఎం చెప్పారు. న్యాయం జరిగిందని పోలీస్ స్టేషన్‌ నుంచి బాధితుడు చిరునవ్వుతో వెళ్లినప్పుడే పోలీసు వ్యవస్థకు గౌరవం పెరుగుతుందన్నారు. అందరికీ చట్టం ఒకేలా పనిచేస్తేనే వ్యవస్థలో న్యాయం, ధర్మం బతికే అవకాశం ఉంటుందన్నారు. చట్టం ఏ కొందరికో చుట్టం అవడానికి వీల్లేదన్నారు. ప్రజల కోసం హోంగార్డుల నుంచి డీజీపీ వరకు పడుతున్న శ్రమ అంతా ఇంతా కాదన్నారు. అందుకే దేశంలోనే మొట్టమొదటి సారి పోలీసులకు వీక్లీ ఆఫ్‌ ప్రకటించిన రాష్ట్రం ఏపీ మాత్రమే అని సీఎం అన్నారు.

వారంలో ఒకరోజు కుటుంబసభ్యులతో గడపగలిగితే పోలీసుల పనితీరు మరింత మెరుగుపడుతుందన్న ఉద్దేశంతోనే వీక్లీ ఆఫ్ ఇచ్చినట్టు చెప్పారు. అవినీతి, రౌడీయిజం, నేర ప్రవర్తన ఉన్న వారిపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులను కోరారు. పోలీసు అమరవీరుల కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం హామీ ఇచ్చారు.