‘రండి..ఓటేసి వెళ్లండి’: ఓటర్లకు కలెక్టర్ ఆహ్వాన పత్రిక

‘రండి.. ఓటేసి వెళ్లండి’ అంటు కలెక్టర్ ఓటర్ల కోసం ఓ ఆహ్వాన ప్రత్రిక వేయటించటం..దాన్ని ప్రదర్శించటంతో ప్రకాశం జిల్లాలో అధికారులు వినూత్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది.  

  • Published By: veegamteam ,Published On : April 10, 2019 / 07:28 AM IST
‘రండి..ఓటేసి వెళ్లండి’: ఓటర్లకు కలెక్టర్ ఆహ్వాన పత్రిక

‘రండి.. ఓటేసి వెళ్లండి’ అంటు కలెక్టర్ ఓటర్ల కోసం ఓ ఆహ్వాన ప్రత్రిక వేయటించటం..దాన్ని ప్రదర్శించటంతో ప్రకాశం జిల్లాలో అధికారులు వినూత్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది.  

‘రండి.. ఓటేసి వెళ్లండి’ అంటు కలెక్టర్ ఓటర్ల కోసం ఓ ఆహ్వాన ప్రత్రిక వేయటించటం..దాన్ని ప్రదర్శించటంతో ప్రకాశం జిల్లాలో అధికారులు వినూత్న ప్రచారం ప్రజలను ఆకట్టుకుంటోంది.  ఓటర్లను చైతన్య పరిచి ఓటింగ్ శాతం పెంచేందుకు ప్రతీ ఓటరు తమ ఓటు హక్కుని వినియోగించుకోవాలనే ఉద్ధేశ్యంతో ఈసీ పలు అవగాహన కార్యక్రమాలు చేసింది. ఈ క్రమంలో కలెక్టర్ వేయించిన ఈ ఆహ్వాన పత్రికను ప్రజలు ఆకస్తిగా తిలకిస్తున్నారు. 
Read Also : సమంత పిలుపు : ఆ టీడీపీ అభ్యర్థిని గెలిపించండి

పోలింగ్ కేంద్రాలకు ఓటర్లను రప్పించేందుకు ‘రండి.. ఓటేసి వెళ్లండి’ పేరిట ప్రకాశం జిల్లా ఎన్నికల యంత్రాంగం ప్రచారం చేస్తోంది. ఒంగోలు కలెక్టరేట్‌ ప్రాంగణంలో ఓటు ఆహ్వాన పత్రికను ఏర్పాటు చేసింది. ఏప్రిల్ 11 న జరగనున్న సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌లో ప్రతి ఒక్కరూ పాల్గొని.. విజయవంతంగా ఓటుహక్కును వినియోగించుకోవాలని కోరుతూ జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వినయ్‌చంద్‌ ఓటర్లందరినీ ఆహ్వానిస్తున్నారు.
 

‘ప్రజాస్వామ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగే సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా అభ్యర్థుల ఎన్నికల మహోత్సవానికి మంచిరోజుగా గుర్తించారనీ..ఈ  పోలింగ్ వేడుకకు ఇదే మా ఆహ్వానం’ఇట్లు భారత ఎన్నికల సంఘం అనుమతి వాడరేవు వినయ్ చంద్ ఐఏఎస్, ప్రకాశం జిల్లా కలెక్టర్ పేరుతో దీనిని ముద్రించారు. ఈ ఆహ్వాన పత్రిక అందర్నీ ఆకట్టుకుంటోంది. 
Read Also : పోల్ జర్నీ : టోల్ ప్లాజాల దగ్గర ట్రాఫిక్ రద్దీ