పేద విద్యార్థుల కోసం :కంటైనర్ లో కంప్యూటర్ పాఠాలు

పేద విద్యార్థుల కోసం :కంటైనర్ లో కంప్యూటర్ పాఠాలు

New Project (5)

కంటైనర్స్..సరుకులు..వస్తువుల రవాణాలకే కాదు..క్లాస్ రూమ్స్ లా కూడా ఉపయోగపడుతున్నాయి. బైట నుంచి చూస్తే అదొక పాత కంటైనర్..ఎందుకు పనికి రాదు అనిపిస్తుంది. కానీ లోపల మాత్రం డిజిటల్ హంగులు ఉంటాయి.  విద్యార్థుల కోసం డిజిటల్ క్లాస్ రూమ్స్ ను ఈ కంటైనర్స్ లో ఏర్పాటు చేశారు.

పశ్చిమ గోదావరి జిల్లా తణుకు జిల్లా పరిషత్‌ బోయ్స్ స్కూల్ వద్ద ఈ కంటైనర్‌లో విద్యార్థులకు కంప్యూటర్‌ కోచింగ్ ఇస్తున్నారు. 16 కంప్యూటర్‌లతో గవర్నమెంట్ స్కూల్ విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తున్నారు. విద్యార్థులకు కంప్యూటర్‌ లెసన్స్ చెప్పాలనే ఉద్ధేశ్యంతో హెచ్‌పీ కంపెనీ సీఎస్ఆర్‌ ప్రాజెక్టులో భాగంగా రాష్ట్రానికి మూడు కంటైనర్లను కమిషనర్‌ ఆఫ్‌ స్కూల్‌ ఎడ్యుకేషన్‌కు అప్పగించింది. వీటిని చిత్తూరు, విశాఖ, కృష్ణా జిల్లాల్లోని మూడు స్కూల్స్ లకు  అప్పగించారు. ఈ కంటైనర్ లో కోచింగ్ ద్వారా అన్ని తరగతుల విద్యార్థులకు కంప్యూటర్‌ పరిజ్ఞానంపై అవగాహన కల్పించనున్నారు. పేద విద్యార్థులకు కంప్యూటర్‌ లెసన్స్ తో పాటు ఐఐటీ విద్యార్థులకు ఎప్పటికపుడు మెలకువలు నేర్పించడానికి ఈ కంటైనర్ డిజిటల్ క్లాస్ రూమ్స్ ఎంతగానో ఉపయోగపడుతాయని