విచారణకు ఆదేశం : రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిలో విరాళాల గోల్ మాల్

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆస్పత్రికి వచ్చిన విరాళాల వినియోగంలో

  • Published By: veegamteam ,Published On : October 9, 2019 / 11:08 AM IST
విచారణకు ఆదేశం : రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిలో విరాళాల గోల్ మాల్

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆస్పత్రికి వచ్చిన విరాళాల వినియోగంలో

కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్‌-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రిపై 10టీవీ ప్రసారం చేసిన కథనాలకు ప్రభుత్వం స్పందించింది. ఆస్పత్రికి వచ్చిన విరాళాల వినియోగంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలపై  విచారణకు సిద్ధమైంది. ఆస్పత్రిపై పూర్తిస్థాయిలో విచారణ జరపాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌.. గుడివాడ ఆర్డీవోను ఆదేశించారు. నివేదిక వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటామన్నారు.

సామాన్యులకు పెద్దపీట అని ఊదరగొట్టారు. పేదోళ్లకు ఉచిత వైద్యం అని బిల్డప్‌ ఇచ్చారు. మహోన్నత ఆశయం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి అమాంతం మింగేశారు. 10 టీవీ కథనాల దెబ్బకు అసలు రంగు  బయటపడటంతో… అడ్డంగా దొరికిపోయి నీళ్లు నములుతున్నారు. ఏ జనం నుంచి విరాళాలు సేకరించారో… ఇప్పుడు వారిపైనే విరుచుకుపడుతున్నారు. మేం ఇచ్చిన సొమ్ము ఏం చేశారని ప్రశ్నిస్తే దౌర్జన్యం చేశారు.  మమ్మల్నే నిలదీస్తారా అంటూ రెచ్చిపోయి దాడికి దిగారు. ఒకప్పుడు దాతలుగా కీర్తించిన కూచిపూడి వాసులతోనే… ఇప్పుడు దురుసుగా ప్రవర్తించారు. జనం ఇచ్చిన విరాళాలతో కట్టిన ఆస్పత్రిలోకి… ఇప్పుడు వారినే  రావొద్దంటూ బలవంతంగా బయటకు నెట్టేశారు. రవిప్రకాశ్‌ సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి సిబ్బంది రౌడీయిజంపై కూచిపూడి వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మా అండతో కట్టిన ఆస్పత్రిలోకి వెళ్లడానికి ప్రయత్నిస్తే  అన్యాయంగా దాడి చేశారని వాపోతున్నారు. తమను బయటకు గెంటేసేందుకు ఆస్పత్రి యాజమాన్యం రౌడీలను కూడా తెచ్చుకుందని ఆరోపిస్తున్నారు.

పేద ప్రజలకు ఉచితంగా అమెరికా స్థాయి వైద్యం అంటూ ప్రచారం.. సామాన్యుడి నుంచి ప్రవాసాంధ్రుల వరకూ…. కోట్లకు కోట్లు విరాళాల సేకరణ. అందరికీ చూపించడానికి భారీ బిల్డింగ్ నిర్మాణం. కానీ.. ఆస్పత్రిలో సేవలు  మాత్రం నిల్‌. అత్యాధునిక వైద్యం కాదు కదా.. సాధారణ చికిత్స కూడా అక్కడ ఉచితంగా అందడం లేదు. ఇదీ కృష్ణా జిల్లా కూచిపూడిలోని రవిప్రకాశ్-సిలికానాంధ్ర సంజీవని ఆస్పత్రి వ్యవహారం. పేరు  పెట్టుకోవడంలోనూ.. విరాళాలు సేకరించడంలోనూ శ్రద్ధ చూపించిన రవిప్రకాశ్.. ఆస్పత్రిలో చికిత్సల విషయంలో మాత్రం పట్టించుకోలేదు. అసలు..చికిత్సనందించే ఏర్పాట్లే చేయలేదు.