పక్షవాతంతో కాలుచేయి పనిచేయని బాలికపై అత్యాచారం..గర్భంతో నరకయాతన

  • Published By: nagamani ,Published On : August 22, 2020 / 04:01 PM IST
పక్షవాతంతో కాలుచేయి పనిచేయని బాలికపై అత్యాచారం..గర్భంతో నరకయాతన

ముక్కుపచ్చలారని పదేళ్ల చిన్నారిపై పదే పదే అత్యాచారం..జరిగింది. ఈ అమానవీయమైన హేయమైన చర్యకు ప్రతిఫలంగా ఆ చిన్నారి గర్భం దాల్చింది. ఈ హేయమైన చర్య బ్రెజిల్ దేశాన్ని కుదిపేసింది. బ్రెజిల్ లోని ఎస్పిరిటో సాంటో రాష్ట్రంలోని సావో మాటెయుస్ నగరంలో 10 ఏళ్ల బాలికపై మామ పదే పదే అత్యాచారానికి ఒడిగట్టాడు. అలా గత నాలుగు సంవత్సరాలుగా ఈ దారుణాన్ని కొనసాగించాడు. ఈ విషయం బైటకు చెబితేచంపేస్తానని బెదిరించాడు. ఈ ఘోరానికి ఫలితంగా ఆ చిన్నారి గర్భవతి అయ్యింది.



ఈ క్రమంలో బాలికకు అనారోగ్యంగా ఉండటంతో కుటుంబ సభ్యులు ఆగస్టు 8,2020న హాస్పిటల్ కు తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన డాక్టర్లు గర్భవతి అనిచెప్పారు. దీంతో వారు షాక్ అయ్యారు. ఆ పాపకు ఆరేళ్ల వయసు వచ్చినదగ్గరనుంచీ తనపై మావయ్య అత్యాచారం చేస్తున్నాడనే విషయం వెలుగుచూసింది.

దీంతో పాపకు అబార్షన్ చేయించాలనుకున్నారు. అత్యాచారం కేసులలో గర్భస్రావం చేయటానికి అనుమతించే బ్రెజిలియన్ చట్టం ప్రకారం మరియు గర్భిణీ యొక్క ప్రాణాన్ని కాపాడటానికి అవసరమైనప్పుడు, ఆమెకు అలా చేసే హక్కు ఉంది.కానీ ఆ పాప అబార్షన్ చేయించుకోవడానికి చట్టపరమైన అనుమతి ఉన్నప్పటికీ 22 వారాల గడువు దాటిపోవడంతో అబార్షన్ చెయ్యలేమని బ్రెజిల్ రాజధానిలోని విక్టోరియాలోని ఆస్పత్రిలో వైద్యులు నిరాకరించడంతో ఈ వార్త మరింత వివాదాస్పదమయ్యింది. దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. కానీ పరిస్థితి ఇదిఅని న్యాయస్థానినికి విన్నవించగా అబార్షన్ చేయించుకోవటానికి అనుమతి ఇచ్చింది ధర్మాసనం. అయినా సరే హాస్పిటల్ అబార్షన్ చేయమని చెప్పింది. కానీ ఎట్టకేలకు ఆగస్టు 17న ఆ బాలికకు అబార్షన్ జరిగింది.దీనిపై సంప్రదాయవాదులు, మతవాదులు ఈ అబార్షన్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించారు. కొంతమంది ఆమెకు వైద్యం అందిస్తున్న ఆస్పత్రిలోకి చొరబడి యాగీ చెయ్యడానికి ప్రయత్నించారు.



అత్యాచారానికి గురైన పదేళ్ల పాపకు అబార్షన్ జరగడంతో బ్రెజిల్‌లో అబార్షన్ చేయటంపై భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ.. ఈ వయసు పిల్లలు గర్భం దాల్చి పిల్లల్ని కనడం కన్నా అబార్షన్ చేయించుకోవడమే మంచిదని గత 30 ఏళ్లుగా లైంగిక హింసకు గురైన బాధితులకు వైద్యసహకారాలు అందిస్తున్న డాక్టర్ మిలేనియా అమోరిం అంటున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ మిలేనియం మాట్లాడుతూ.. బ్రెజిల్‌లో ఇటువంటివి కొత్తకాదని ఎన్నో అరాచకాలు మహిళలు..యువతులు..చిన్నారులపై జరుగుతున్నాయని తెలిపారు.

డాక్టర్ మిలేనియా ప్రాక్టీస్ మొదలుపెట్టిన తొలిరోజుల్లో ఒక 13 ఏళ్ల అమ్మాయికి అబార్షన్ చెయ్యాలంటూ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పక్షవాతంతో కాళ్లు, చేతులు చచ్చుబడిపోయిన ఆ అమ్మాయి తన ఇంటి వెనకాలే అత్యాచారానికి గురయ్యింది. ఇంటి దగ్గరే ఇటువంటి దారుణాలకు చిన్నారులు బలైపోతుంటే వారికి ఇంకెక్క రక్షణ ఉంటుందని తీవ్ర ఆవేదనగా ప్రశ్నించారామె. బట్టలు ఉతికే పని జీవనాధారమైన ఆమె తల్లి.. కూతురి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంటి వెనుక ఎండ తగిలేలా కూర్చోబెట్టి ఇంటిలోపల పని చేసుకుంటూ ఉండగా ఆ పాపపై అత్యాచారం జరిగింది. రేప్‌వల్ల ఆమె గర్భవతి అయ్యింది. అబార్షన్ చేయటం పాపం అంటూ ఆ ఆస్పత్రిలో డాక్టర్లెవ్వరూ ముందుకు రాలేదు. కానీ డాక్టర్ అమోరిం ఆ బాధ్యత నిర్వహించారు. కానీ ఆమెతో పాటు పనిచేసే తోటి డాక్టర్లందరూ అబార్షన్‌ ను వ్యతిరేకించారని తెలిపారు.



చదువు పూర్తయ్యాక వృత్తిలో ప్రవేశించాను.అప్పటికి నేను చాలా చిన్నదాన్ని. పెద్ద పెద్ద డాక్టర్లు అక్కడ ఉండేవారు. చాలా సీనియర్లు ఉన్నారు. అందరూ ఆ పాపకు అబార్షన్ ను వ్యతిరేకించారు. చేయం అని చెప్పేశారు. కానీ ఆ అమ్మాయికి అబార్షన్ చెయ్యాలని నిశ్చయించుకున్నాను. అది అమె హక్కు. చాలా చిన్నపిల్ల. ఆ వయసులో, పక్షవాతంతో కాలుచేయి పనిచేయని స్థితిలో ఆ పాపం తల్లి అయితే ఆమె తన జీవితం నాశనమవుతుంది అందుకే అబార్షన్ చేయాలనుకున్నానని డాక్టర్ అమోరిం తన పాత జ్ఞాపకాలను ప్రస్తుత 10ఏళ్ల బాలిక పరిస్థితుల్ని అన్వయించుకుని మాట్లాడారు.

అత్యాచారం వల్ల గర్భం దాల్చినప్పుడు లేదా ప్రాణహాని ఉన్న కేసుల్లో మాత్రమే అబార్షన్‌కు బ్రెజిల్ చట్టాలు అనుమతిస్తాయి.ఈ పదేళ్ల పాప విషయంలో అబార్షన్‌కు కోర్టు అనుమతిచ్చింది. కానీ ఇప్పటికీ అబ్బార్షన్లు చేయటానికి డాక్టర్లు పెద్దగా ముందుకు రారని తెలిపారు. ఇలాంటి సంఘటనలు అరుదేమీ కాదనీ..తన ఇన్నేళ్ల సర్వీసులో ఇటువంటి కేసులు ఎన్నో చూసానని డాక్టర్ అమోరిం అంటున్నారు. బ్రెజిల్ ఆరోగ్య వ్యవస్థ ఎస్‌యూఎస్‌లో 10 నుంచీ 14 లోపు వయసువారిలో రోజుకు కనీసం ఆరు అబార్షన్లు నమోదవుతున్నాయని తెలిపారు.బ్రెజిలియన్ పబ్లిక్ సేఫ్టీ ఫోరం అనే ప్రభుత్వేతర సంస్థ గణాంకాల ప్రకారం బ్రెజిల్‌లో గంటకు కనీసం నలుగురు 13 యేళ్ల వయసు లోపలి చిన్నారులు అత్యాచారానికి గురవుతున్నారు.



అటువంటి బాధితులు తీవ్రమైన నొప్పి, బాధ, భయంతో ఆస్పత్రికి వస్తారు. ముక్కుపచ్చలారని ఆ పదేళ్ల పిల్లను ఆ అవస్థలో చూడాలంటే కోపం, బాధ, అయోమయం, అసహ్యం, ఆశ్చర్యం అన్నీ కలుగుతాయని డాక్టర్ అమోరిం తీవ్ర ఆవేదనతో తెలిపారు.

210 మిలియన్ల జనాభా ఉన్న దేశంలో 76 ఆస్పత్రులు మాత్రమే 2019 లో చట్టబద్దమైన గర్భస్రావం చేస్తున్నాయి. జూన్లో, కోవిడ్ -19 మహమ్మారి కారణంగా ఆ సంఖ్య 42 కు తగ్గిపోయింది . అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం ప్రకారం, అత్యాచారం నుండి బయటపడినవారికి గర్భస్రావం చేయడాన్ని నిరాకరించడం లేదా ఆలస్యం చేయడం హింసకు దారితీస్తుంది .

ఆ వయసులో గర్భం దాల్చడం అత్యంత ప్రమాదకరం. 15 ఏళ్ల లోపు వయసులో గర్భం దాల్చి బిడ్డలకు జన్మనిచ్చేవాళ్లు, 20 యేళ్ల వయసువారికంటే 5 రెట్లు ఎక్కువగా ప్రసవం సమయంలో చనిపోతారాని సాక్షాత్తూ యునిసెఫ్ అధ్యయనం తేలింది.



అమెరికన్ జర్నల్ ఆఫ్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో వచ్చిన ఒక అధ్యయనం ప్రకారం లాటిన్ అమెరికాలో చిన్నవయసులో గర్భం దాల్చిన పిల్లల మీద జరిపిన పరిశోధనలో 15 లేదా అంతకన్నా తక్కువ వయసులో బిడ్డలకు జన్మనిచ్చేవారికి తీవ్రమైన రక్తహీనత, ప్రసవానంతర రక్తస్రావం అధికంగా ఉంటాయని తేలింది.అలా చిన్న వయసు ఆడపిల్లలకు పుట్టే బిడ్డలు ఎక్కువకాలం బతికే అవకాశం తక్కువ.

10-15 వయసు పిల్లలు గర్భం దాల్చినప్పుడు ఎక్లంప్సియా, ప్రీ ఎక్లంప్సియాకు గురయ్యే అవకాశాలు ఎక్కువ అని డాక్టర్ అమోరిం అన్నారు. అంటే రక్తపోటు స్థాయిలు పెరిగి కోమాలోకి వెళిపోయే ప్రమాదం కూడా ఉంటుందని అన్నారు.



13 ఏళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లలు ఇంకా ఎదుగుతున్న దశలోనే ఉంటారు. శరీరం, లోపలి భాగాలు ఎదగవు. శరీరంలోపల ప్రసవానికి తగ్గ ఏర్పాటు సరిగా ఉండదు. ఈ వయసువారు బిడ్డలు కనడం అత్యంత ప్రమాదకరమని డాక్టర్ అమోరిం చెప్పారు.ఈ వయసులో బిడ్డకు జన్మనివ్వడం కన్నా అబార్షన్ చేయించుకోవడమే మేలు
చిన్నవయసులో అబార్షన్లకు కోర్టు అనుమతిస్తుంది కాబట్టి ఈ వయసులో బిడ్డలకు జన్మనివ్వడం కన్నా అబార్షన్ చేయించుకోవడమే మేలని డాక్టర్ అమోరిం అన్నారు.

కాగా..డాక్టర్ మిలేనియం అమోరిం క్యాంపినా గ్రాండే ఫెడరల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా కూడా పనిచేస్తున్నారు. అత్యాచారాలకు గురైన బాలికలు కోర్టు అనుమతితో, డాక్టర్ల పరిరక్షణలో అబార్షను చేయించుకోవడమే ఉత్తమం డాక్టర్ మిలేనియం అమోరిం పదే పదే చెబుతున్నారు. అది వారి జీవితానికి ఎంతో మంచిదని తెలిపారు.