మునిగిన బోటులో ఉన్నది 73మంది కాదు.. 93మంది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

  • Published By: vamsi ,Published On : September 19, 2019 / 11:51 AM IST
మునిగిన బోటులో ఉన్నది 73మంది కాదు.. 93మంది.. మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు

గోదావరిలో బోటు ప్రమాదంపై అమలాపురం మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన కామెంట్లు చేశారు. గోదావరిలో మునిగిపోయిన బోటులో ఉంది 73మంది ప్రయాణికులు కాదని, 93మంది అని ఆయన అన్నారు. బోటులో ప్రయాణికుల సంఖ్యను అధికారులు తప్పుగా  చెప్పారని హర్షకుమార్ మండిపడ్డారు.

దీని గురించి తన దగ్గర విశ్వసనీయ సమాచారం ఉందని హర్షకుమార్ చెప్పారు.  బోటు వెళ్లేందుకు దేవీపట్నం ఎస్ఐ అనుమతి ఇవ్వలేదని,  అయితే అవంతి శ్రీనివాస్ ఫోన్ చేయడంతో బోటు కదిలిందని సంచలన ఆరోపణలు చేశారు హర్షకుమార్ చెప్పారు.

బోటు ప్రమాదం గురించి సంచలనం చేద్దామని ఇలా చెప్పట్లేదని, పూర్తిగా వివరాలు తెలుసుకున్న తర్వాత వివరాలు చెబుతున్నట్లు చెప్పారు. మంత్రి అవంతి శ్రీనివాస్ ఒత్తిడితోనే ఆ బోటుకు అనుమతి వచ్చిందని హర్షకుమార్ ఆరోపించారు.

సోమవారం మధ్యాహ్నానికి బోటు జాడ తెలిసిందని, లెక్కకు మించి మృతదేహాలు బయటపడతాయని బోటును బయటకు తీయట్లేదని అన్నారు. బోటులలో అసాంఘిక చర్యలు చాలాకాలం నుంచి జరుగుతున్నాయని, ఈ బోటులో కూడా అలా జరగడంతో బోటు బయటకు రావట్లేదని అన్నారు.