కడుపు నిండా తినండి బిల్లు సగమే కట్టండి..ప్రభుత్వం బంపర్ ఆఫర్

  • Published By: nagamani ,Published On : July 10, 2020 / 04:57 PM IST
కడుపు నిండా తినండి బిల్లు సగమే కట్టండి..ప్రభుత్వం బంపర్ ఆఫర్

బ్రిటన్ లో లాక్ డౌన్ తరువాత కొన్ని నిబంధనలు పాటిస్తూ నెమ్మది నెమ్మది హోటళ్లు, రెస్టారెంట్లు తెరుచుకుంటున్నాయి. హోటళ్లు, రెస్టారెంట్లు తెరిచేందుకు బ్రిటన్ ప్రభుత్వం నిర్ణయించింది. మాస్క్ లు పెట్టుకుని..భౌతిక దూరం పాటిస్తూ.. అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ యజమానులు కష్టమర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసారు. అయినా ప్రజల నుంచి పెద్దగా స్పందన రావటంలేదు. దీంతో యజమానులు అల్లాడిపోతున్నారు.

దీంతో బ్రిటన్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. ఎవరూ హోటల్స్‌లో భోజనం చేసినా కేవలం 50 శాతం మాత్రం బిల్లు చెల్లించవచ్చు..దానికి ఆయా యజమానులకు ప్రభుత్వం నుంచి ట్యాక్స్ వసూలు రాయితీలు ఉంటాయని ప్రకటించింది.
ఆగస్టు నెల మొత్తం ఈ ఆఫర్ ఉంటుందని బుధవారం (జూలై 8,2020)బ్రిటన్ పార్లమెంట్ అత్యవసర మినీ బడ్జెట్‌లో సమావేశంలో మంత్రి రిషి సునక్ తెలిపారు. కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే..ఈ ఆఫర్ కేవలం జూలై 15 నుండి అమల్లోకి వచ్చి 12 జనవరి 2021 లో కొనసాగుతుంది.

ఈ ఆఫర్ బ్రిటన్‌లోని 1,29,000 కేఫ్‌లు, రెస్టారెంట్లలో చెల్లుబాటు అవుతుందని..2.4 మిలియన్ల మంది ఉద్యోగాలు రక్షించటానికి ఈ రాయితీ ప్రకటించామని ఛాన్సలర్ తెలిపారు. మాస్కులు, ధరించి భౌతిక దూరం పాటిస్తూ.. ఆయా హోటళ్లకు వచ్చి భోజనం చేసి బంపర్ ఆఫర్ పొందాలని సూచించారు. మరి ఈ కష్టకాలంలో ఆఫర్ ఎంత మేర పని చేస్తుందో చూడాలని పలువురు అభిప్రాయపడుతున్నారు.

కాగా..కరోనా వైరస్ ప్రతీ దేశంపైనా ఆర్థికంగా తీవ్ర ప్రభావాన్ని చూపిన విషయం తెలిసిందే. అగ్రరాజ్యాలు సైతం కరోనా కొట్టిన దెబ్బకు కుదేలైపోయాయి. వాటిని తిరిగి పునరుద్ధరించటానికి తిరిగి కోలుకోవటానికి పలు యత్నాలు చేస్తున్నాయి. ఈక్రమంలో ఉద్యోగాలను రక్షించడానికి, కరోనావైరస్ తో వచ్చిన ఆర్థిక ప్రభావాన్ని తగ్గించటానికి బ్రిటిష్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఆర్థిక మంత్రి రిషి సునక్ తెలిపారు.

Read Here>>అపార్ట్ మెంట్ లో మంటలు..చిన్నారిని మూడంతస్తుల భవనం నుంచి విసిరేసిన తల్లి..