నాలుగవ రోజు నానే బియ్య బతుకమ్మ 

  • Published By: veegamteam ,Published On : October 1, 2019 / 02:52 AM IST
నాలుగవ రోజు నానే బియ్య బతుకమ్మ 

నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మను తెలంగాణ ఆడబిడ్డలు అత్యంత ఉత్సాహంతో జరుపుకుంటున్నారు. ఆశ్వయుజ మాసంలో వచ్చే బతుకమ్మ పండుగతో ప్రతీ ఇంటా పూల సౌరభాలు గుభాళిస్తున్నాయి. రంగు రంగుల పూలతో ప్రతీ లోగిలి శోభాయమానంగా వెలుగొందుతోంది. తెలంగాణ ఆడబిడ్డలు  ఆడంబరంగా జరుపుకునే నాలుగవ రోజు నానే బియ్యం బతుకమ్మకు నానేసిన బియ్యం, పాలు, బెల్లం కలిపి నైవేద్యంగా నివేదించాలి. 

నాలుగవరోజు రోజు తంగేడు, గునుగు పూలతో నాలుగంతరాలు అంటే నాలుగు అంతస్థులుగా  బతుకమ్మను పేర్చి పూల పైన గౌరమ్మను పెట్టి ఆడబిడ్డలంతా ఆట పాటలతో బతుకమ్మను కొలుచుకుంటారు. నానబెట్టిన బియ్యం బెల్లంతో కలిపి ముద్దలు చేసి..ప్రసాదంగా పెట్టి వాయనాలుగా పంచుకుంటారు.  

ప్రతి ఇంట్లో పూల పండుగ పరవశంలో ముంచెత్తుతోంది. ప్రకృతిని, పూలను ఆరాధించే అత్యంత అరుదైన ఈ పండుగ తెలంగాణలో మాత్రమే కన్నులనిండుగా జరుగుతుంది. ఊళ్లన్నీ పూల కోలాహలంగా మారిపోయాయి.