నేను బతికే ఉన్నా.. నన్ను నమ్మండి ప్లీజ్.. మూడేళ్లుగా పోరాడుతున్న మహిళ

నేను బతికే ఉన్నా.. నన్ను నమ్మండి ప్లీజ్.. మూడేళ్లుగా పోరాడుతున్న మహిళ

french woman

French Woman: కళ్లముందు మనిషి కనపడుతున్నా.. లేదు నువ్వు చచ్చిపోయావంటున్నారు అధికారులు. మూడేళ్లుగా ఇదే పోరాటం. బతికున్నాను బాబోయ్ అని చెప్తున్నా ఎవరూ లెక్కచేయడం లేదని మొరపెట్టుకుంటుందో మహిళ. ప్రభుత్వం తరపున బెనిఫిట్స్ పొందేవారు, ప్రొఫెషనల్ గా రిటైర్ అయిన వారికి బతికి ఉంటేనే కదా.. అవన్నీ అందేది. అదే చనిపోయినట్లు ప్రభుత్వానికి అనిపిస్తే ఎటువంటి బెనిఫిట్స్‌కు అవకాశం లేదు.

అలాంటి పరిస్థితి నుంచి బయటపడటానికి లైవ్ సర్టిఫికేట్ చూపించాల్సిందే మరి. ఫ్రాన్స్‌కు చెందిన జెన్‌ పౌచైన్‌ అనే మహిళ బతికి ఉన్నానని నిరూపించుకోవడానికి మూడేళ్లు అయినా ప్రయత్నం ఫలించలేదు. అధికారుల పొరపాటు కాదు. ఆమె వైఖరే అన్ని సమస్యలకు కారణఱం అయింది.

తన దగ్గర పనిచేసే సిబ్బందికి జీతాలు ఇవ్వకపోవడం అటుంచి ఏ సమాధానం చెప్పకుండా ఊరుకుంది. ఓ మహిళా ఉద్యోగి తమకు ఉద్యోగం పోయిందని బతకడానికి.. ఆసరాగా ఎంతోకొంత ఇప్పించాలని కోర్టును ఆశ్రయించి డిమాండ్ చేసింది.

క్లీనింగ్‌ కంపెనీ నిర్వహిస్తున్న 58 ఏళ్ల జెన్‌ పౌచైన్‌ 2000 సంవత్సరంలో కాంట్రాక్టును కోల్పోయింది. భారీగా నష్టాలు రావడంతో సంస్థలో ఉద్యోగులను తొలగించింది. ఆ సమయంలో ఉద్యోగం కోల్పోయిన మహిళ 14వేల యూరోలు చెల్లించాలంటూ పరిహారం వేసింది. 2004లో జెన్‌ సంస్థను కోర్టు ఆదేశించింది. కోర్టు ఆర్డర్లను జెన్‌ అమలుపరచలేదు. ఐదేళ్ల తర్వాత మరోసారి కేసు వేసినా.. ఇతర కారణాలతో కోర్టు కొట్టివేసింది.

సమస్య ముగిసిందనుకున్న సమయంలో మరోలా మొదలైంది. జెన్‌ తన ఉత్తరాలకు జవాబు ఇవ్వలేకపోయింది కాబట్టి, తాను మరిణించినట్లే పరిగణించాలంటూ జెన్‌కు బదులుగా ఆమె భర్త, కొడుకు తనకు పరిహారం చెల్లించేలా చూడాలని కోర్టును కోరింది. ఆమె వాదనలు నమ్మిన కోర్టు ఎలాంటి సర్టిఫికేట్లు పరిశీలించకుండానే 2017లో జెన్‌ చనిపోయినట్లు ప్రకటించింది.

అంతే.. ఆమె పేరిట ఉన్న.. ఐడీ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌, బ్యాంక్‌ అకౌంట్‌, ఆరోగ్య బీమా అన్నీ క్యాన్సిల్ అయ్యాయి. తీర్పును తప్పుబడుతూ జెన్‌ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కిన ఆమె.. న్యాయమూర్తుల ముందు నిలబడి తను బతికే ఉన్నట్లు ఎన్ని సర్టిఫికేట్లు చూపించినా.. ఎవరూ నమ్మడం లేదు. ఈ కేసులో ఎలాంటి ఫలితాలు ఎదుర్కొన్నా పర్లేదని.. చివరి వరకు ప్రయత్నిస్తూనే ఉంటామని జెన్‌ తరఫు న్యాయవాది వెల్లడించారు.