Medakలో యుద్ధ ట్యాంకుల తయారీ.. మరింత బలం పుంజుకోవాలని..

Medakలో యుద్ధ ట్యాంకుల తయారీ.. మరింత బలం పుంజుకోవాలని..

Medak:శత్రు దేశాల కవ్వింపులు.. యథేచ్ఛగా చెలరేగిపోతున్న విష ప్రచారాలు.. భారత భూ భాగాన్ని ఆక్రమించుకునేందుకు చేసే ప్రయత్నాల్నింటినీ తిప్పికొట్టేందుకు మరింత సామర్థ్యాన్ని పోగు చేసుకుంటుంది ఇండియా. ఈ క్రమంలో రూ.1,094 కోట్లు వెచ్చించి 156 ఇన్‌ఫాంట్రీ కాంబాట్‌ వెహికిల్‌ (ఐసీవీ) బీఎంపీ-2 యుద్ధట్యాంకులను Medak వేదికగా తయారుచేస్తుంది. దేశ రక్షణరంగానికి ఎన్నో యుద్ధట్యాంకులు, అధునాతన యంత్రాలను అందించిన ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ (ఓడీఎఫ్‌) యుద్ధ ట్యాంకుల తయారీలో నిమగ్నమైంది.




సంగారెడ్డిజిల్లా కంది మండలంలోని ఓడీఎఫ్‌లో ఐసీవీ బీఎంపీ-2గా పిలిచే ట్యాంకుల తయారీ గురించి ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం.

రష్యా యుద్ధ ట్యాంకులకు దగ్గరగా:
ఐసీవీ బీపీఎం2గా పిలిచే 156 యుద్ధ ట్యాంకుల తయారీ కోసం ఓడీఎఫ్‌కు జూన్‌ 2న కేంద్ర రక్షణశాఖ కార్యాలయం నుంచి ఆదేశాలు రాగా, ఆగస్టు మొదటివారం నుంచి పరిశ్రమలో ట్యాంకుల తయారీని ప్రారంభించారు. ఈ తయారీకోసం కేంద్రం రూ.వెయ్యి 94 కోట్లు వెచ్చిస్తుంది. ఇప్పుడు వీటి తయారీతో ఓడీఎఫ్‌కు మరింత గుర్తింపు లభించినట్టే. తయారైన ట్యాంకులను పరిశ్రమల ఆవరణలోనే అన్ని రకాలుగా పరీక్షలు చేస్తున్నారు.




రక్షణ యుద్ధ ట్యాంకుల్లో భాగంగా మొదటిసారి ఓడీఎఫ్‌లోనే.. బుల్లెట్‌ ఫ్రూఫ్‌ వాహనాలు తయారుకావడం విశేషమని వెల్లడించారు. రష్యాకు చెందిన బోయివయ మాషిన పెహోటి 2/2కే వంటి వాటిని పోలి ఉండే యుద్ధ ట్యాంకులు అని సమాచారం.

2023 నాటికి రెడీ చేయాలని:
ఐసీవీ బీఎంపీ-2 యుద్ధట్యాంకుల తయారీని 2023 నాటికి రెడీ చేయడమే టార్గెట్ గా పనిచేస్తున్నాం. దేశ సరిహద్దులో చోటుచేసుకుంటున్న ఘటనల నేపథ్యంలో దేశానికి అధునాతన ఆయుధసంపత్తి ఉండాలని అభిప్రాయపడ్డారు. రక్షణరంగానికి ఆయుధాలు తయారుచేయడంలో ఓడీఎఫ్‌ కృషి గొప్పదని అన్నారు. భారత సైన్యానికి అవసరమైన అధునాతన ఆయుధ సంపత్తిని అందించడమే సంకల్పంగా పనిచేస్తున్నాం.




ఐసీవీ బీఎంపీ-2 ప్రత్యేకతలు:
* భూమిపై ప్రయాణ వేగం గంటకు 70 కిలోమీటర్లు.
* నీటిలో వేగం గంటకు 7కిలోమీటర్లు.
* అగ్ని నుంచి పూర్తి రక్షణ దీని ప్రత్యేకత.
* నావిగేషన్‌, రేడియో సెట్‌, ఇతర డిజిటల్‌ సౌకర్యాలు.
* 300 హార్స్‌ పవర్‌ ఇంజిన్‌.
* 35 డిగ్రీల కోణంలో వచ్చే అడ్డంకులను సునాయాసంగా అధిగమించగలడం.