మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలోఉన్న గోడకూలి ఏడుగురు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షం కారణంగా నిర్మాణంలో ఉన్న గోడ కుప్పకూలింది.

మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం.. నిర్మాణంలోఉన్న గోడకూలి ఏడుగురు మృతి.. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్ రెడ్డి

wall collapsed seven people died

Tragedy In Medical : మేడ్చల్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లా పరిధిలోని బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో భారీ వర్షం కారణంగా నిర్మాణంలోఉన్న గోడ కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఏడుగురు కార్మికులు మృతిచెందారు. మరో నలుగురికి గాయాలయ్యాయి. ఈ ప్రమాదం మంగళవారం అర్ధరాత్రి సమయంలో చోటుచేసుకుంది. కూలిన గోడ శిథిలాల కింద చిక్కుకున్న మృతదేహాలను వెలికి తీసేందుకు జీహెచ్ ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది తెల్లవారుజాము వరకు సహాయక చర్యలు చేపట్టారు.

Also Read : Cm Revanth Reddy : భారీ వర్షాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశాలు

మృతులంతా ఒడిశా, ఛత్తీస్ గఢ్ రాష్ట్రాలకు చెందిన కార్మికులుగా గుర్తించారు. ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతుల్లో ఓ మహిళ, నాలుగు సంవత్సరాల బాలుడు కూడా ఉన్నారు. గాయపడిన కార్మికులను చికిత్స నిమిత్తం స్థానికి ఆస్పత్రికి తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. మృతులు తిరుపతిరావు (20), శంకర్‌ (22), రాజు (25), రామ్‌ యాదవ్‌ (34), గీత (32), హిమాన్షు (4), ఖుషిగా గుర్తించారు. మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు బాచుపల్లి ఘటన నేపథ్యంలో రైజ్ కన్ స్ట్రక్షన్ ఎండీ అరవింద్ రెడ్డి పై బాచుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. భవన నిర్మాణంలో నాణ్యత పాటించకపోవడం, కార్మికుల విషయంలో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగినట్టు అధికారులు అంచనాకు వచ్చారు. ఏడుగురి మృతదేహాలకు గాంధీ ఆస్పత్రిలో పోస్టుమార్టం అనంతరం స్వరాష్ట్రాలకు తరలించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న వారు క్షేమంగా ఉన్నారని అధికారులు చెప్పారు.

Also Read : తడిసిన ఉప్పల్ స్టేడియం.. ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుందా? భారీ వర్షంతో జీహెచ్ఎంసీకి ఫిర్యాదుల వెల్లువ

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం రేవంత్..
బాచుపల్లి రేణుక ఎల్లమ్మ కాలనీలో నిర్మాణంలో ఉన్న గోడ కూలి ఏడుగురు మరణించడంపై సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. తప్పిదం ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. కుండపోత వర్షం పడడంతో ఒక్కసారిగా గోడ కూలినట్లు తెలిపిన అధికారులు.. భవనానికి పక్కనే ఉన్న సెంట్రింగ్ పనిచేసే కార్మికుల్లో ఏడు మంది మృతి చెందగా.. మరో నలుగురికి గాయాలైనట్లు తెలిపారు. చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. గాయపడిన వారికి సరియైన వైద్య చికిత్స అందించాలని అధికారులను రేవంత్ ఆదేశించారు.

డీసీపీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ..
బాచుపల్లి ఘటనపై డీసీపీ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి ప్రహరీ గోడ కూలి కార్మికులు మరణించారని చెప్పారు. మొత్తం ఏడుగురు కూలీలు మరణించగా.. వారిలో నలుగురు ఒరిస్సా, ముగ్గురు ఛత్తీస్ గఢ్ వాసులుగా గుర్తించినట్లు తెలిపారు. రిటర్నింగ్ వాల్ నాణ్యతలోపం కనిపిస్తోందని, భవనం ఓనర్ అరవింద్ రెడ్డిగా గుర్తించామని, కేసు నమోదు చేసుకోవటం జరిగిందని, బాధితులను త్వరలోనే రిమాండ్ చేస్తామని డీజీపీ శ్రీనివాస్ తెలిపారు.