ఆ చేపలు తినేవారు జాగ్రత్త..కరోనా ప్రమాదం ఉందంటున్న పరిశోధకులు

  • Published By: nagamani ,Published On : September 10, 2020 / 10:33 AM IST
ఆ చేపలు తినేవారు జాగ్రత్త..కరోనా ప్రమాదం ఉందంటున్న పరిశోధకులు

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి ఉదృతిని ఏమాత్రం తగ్గట్లేదు. రోజు రోజుకు పెరుగుతు ప్రజల్ని వణికించేస్తోంది. ఇప్పటివరకు ఆహార పదార్థాలపై రోనా వైరస్ ఉనికిపై పెద్దగా ఆందోళనపడిన ఘటనలేమీ పెద్దగా లేవనే చెప్పాలి. కానీ తాజాగా చైనా పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో ఆసక్తికర అంశం వెల్లడైంది. ఇది చాలా ఆలోచించాల్సి విషయమనే చెప్పుకోవాలి.



https://10tv.in/antibodies-may-not-guarantee-protection-from-covid-19-scientists/
ప్రపంచ వ్యాప్తంగా చాలామంది సాల్మన్ చేపల్ని ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి చాలా ఖరీదైనవి. అయినా సరే దాని రుచి..దాంట్లో ఉండే మాంసకృతులు..ప్రొటీన్స్, ఒమేగా 3 వంటివి పుష్కలంగా ఉండటంతో సాల్మన్ చేపల్ని ఎక్కువగా తింటుంటారు. అయితే సాల్మన్ చేపల్లో కరోనా వైరస్ క్రిములు వారం రోజుల వరకు ఉంటాయని చైనా వ్యవసాయ విశ్వవిద్యాలయం,గ్వాంగ్‌డాంగ్‌లోని వ్యవసాయ శాస్త్రాల పరిశోధకుల అధ్యయనంలో గుర్తించారు.


4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద సాల్మన్ చేపలను నిల్వ ఉంచితే కరోనా వైరస్ 8 రోజుల పాటు సజీవంగా ఉంటుందని వీరి అధ్యయనంలో తేలింది. సాధారణ గది ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ వద్ద కరోనా వైరస్ రెండు రోజులు జీవించి ఉండగలదని తేలింది. ఇక సాల్మన్ చేపలను ఎగుమతి చేసే సమయంలో వాటిని ఉంచే బాక్సుల్లో 4 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండేలా చూస్తారు.


ఈ ప్రకారంగా చూస్తే..కరోనా వైరస్ 6 రోజులు మనుగడ సాగించగలదని చైనా పరిశోధకులు చెబుతున్నారు. కాబట్టి…సాల్మన్ చేపల ఎగుమతి, దిగుమతి విషయంలోను.. ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు పరిశోధకులు. దీంతో సాల్మన్ చేపల తరలింపుల విషయంలో తగిన జాగ్రత్తలు.. తనిఖీలు చేయాల్సిన తప్పనిసరి పరిస్థితిని ఈ అధ్యయనం చాటుతోందని ఈ పరిశోధనలో పాలుపంచుకున్న డై మన్మాన్ పేర్కొన్నారు.



చేపల వల్ల ఉపయోగాలు

సాల్మన్ చేపలను వారంలో కనీసం 2 సార్లు తినటం వల్ల చాలా ఉపయోగాలున్నాయని న్యూట్రీషియన్లు చెబుతున్నారు. సాల్మన్ చేపల్లో విటమిన్ డి, ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. సూర్యకాంతి ద్వారా మనకు లభించే విటమిన్ డికి సమానంగా పోషకాలు మనకు సాల్మన్ చేపలు తినటం వల్ల లభిస్తాయి.
సాల్మన్
దీంతోపాటు ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా చేపల్లో సమృద్ధిగా ఉంటాయి. ఇవి మెదడును యాక్టివ్‌గా ఉంచుతాయి. అల్జీమర్స్ తరచూ చేపలను తింటే వయస్సు మీద పడడం వల్ల వచ్చే అల్జీమర్స్, దెమెంతియా వంటి వ్యాధుల బారి నుంచి తప్పించుకోవచ్చు. జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ఈ చేపల్లో ఉండే ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు మన మానసిక ఆరోగ్యానికి కూడా పనిచేస్తాయి. ఇవి డిప్రెషన్ నుంచి రిలీఫ్ నిస్తాయి.మానసిక ఆందోళనను తగ్గిస్తాయి.

అంతేకాదు ముఖ్యంగా ఈకరోనా కాలంలో ప్రతీ మనిషికి ముఖ్యంగా కావాల్సింది ‘ఇమ్యూనిటీ’ ఈ సాల్మన్ చేపలు తింటే ఇమ్యూనిటీ చాలా బాగా పెరుగుతుంది. ఇన్ ఫెక్షన్లనుంచి రక్షణ లభిస్తుంది. డయాబెటిస్..ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రాకుండా ఉంటాయి. ఇక మెదడు చురుగ్గా పనిచేయాలంటే.. చేపలు ఆహారంలో చేర్చుకోవాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చేపల్లో వుండే ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు మెదడు అభివృద్ధికి తోడ్పడుతాయి. దెబ్బతిన్న నాడీవ్యవస్థను మెరుగుపరుస్తాయి.గుండెజబ్బులు,పక్షవాతం ముప్పుల నుంచి కాపాడేందుకు చేపలు చాలా బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.