సుహాస్ లవ్ స్టోరీ గురించి తెలుసా!

10TV Telugu News

Suhas Lovestory: సినిమాల్లో నటించాలనే కోరికతో హైదరాబాద్‌లో అడుగుపెట్టి సినిమా కష్టాలు పడుతూ.. వచ్చిన అవకాశాల్ని ఉపయోగించుకుంటూ ‘మజిలీ’ మూవీతో మంచి గుర్తింపు తెచ్చుకుని ఇప్పుడు హీరోగా తెలుగు ప్రేక్షకుల మనసులు దోచుకున్నాడు యంగ్ అండ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్.


సుహాస్, చాందిని చౌదరి జంటగా సందీప్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన హార్ట్ టచింగ్ లవ్ స్టోరీ ‘కలర్ ఫోటో’.. ఇటీవలే ‘ఆహా’ ద్వారా విడుదలైన ఈ సినిమాకు ఏ స్థాయి స్పందన వస్తుందో తెలిసిందే. సినిమా చూసిన వారంతా సుహాస్ నేచురల్ పెర్ఫార్మెన్స్‌ని పొగుడుతున్నారు. సెలబ్రిటీలు స్వయంగా పిలిచి మరీ అభినందిస్తున్నారు. Colour Photo Telugu Movie Streaming On Aha Video - Entertainment,Trending Topics,Technology,Latest Newsఈ సందర్భంగా ఇటీవల ఓ యూట్యూబ్ ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో తన గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పాడు సుహాస్. ఇంట్లో జాబ్ అని అబద్ధం చెప్పి నంద్యాల వెళ్లి.. అక్కడినుండి రెండు రోజులకొకసారి హైదరాబాద్ వచ్చి అవకాశాల కోసం సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగేవాడట.


అసలే సినిమా కష్టాలంటే తనకు అంతకుముందు నుంచే లవ్ అంట.. అమ్మాయి వాళ్ల ఇంట్లో వాళ్లతో కూడా మాట్లాడి.. దాదాపు ఏడు సంవత్సరాలు ప్రేమ తర్వాత చక్కగా సెటిల్ అయ్యాక 2017 లో తన ప్రేయసిని పెళ్లి చేసుకున్నాడు సుహాస్. కెరీర్, ప్రేమ రెండింటినీ బ్యాలెన్స్ చేస్తూ.. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఈ స్థాయికి చేరుకుని ఎందరికో స్ఫూర్తిగా నిలిచాడు సుహాస్.